హైదరాబాద్: చిత్ర పరిశ్రమకు పెను సవాలుగా మారిన 'ఐబొమ్మ' పైరసీ వెబ్‌సైట్ కింగ్‌పిన్ ఇమ్మడి రవి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ పోలీసులకే సవాల్ విసిరిన రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వ్యక్తిగత పనుల కోసం విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు.
అనంతరం కోర్టు అనుమతితో 12 రోజులు రవిని కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు. కస్టడీలో వెల్లడైన వివరాలను కోర్టుకు సమర్పించారు పోలీసులు. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవి పైరసీ దందా ఏ విధంగా సాగించాడు.. ఏ విధంగా డబ్బు సంపాదించాడనే వివరాలు రాబట్టారు పోలీసులు.
12 రోజులపాటు కస్టడీలో ఐబొమ్మ రవి:
▪️ కస్టడీలో వెల్లడైన వివరాలను కోర్టుకు సమర్పించిన పోలీసులు
▪️ సినిమాలను రెండు రకాలుగా కొనుగోలు చేసిన ఐబొమ్మ రవి
▪️ క్యామ్‌కార్డర్ ప్రింట్‌కు ఒక్కో సినిమాకు 100 డాలర్లు
▪️ HD ప్రింట్ సినిమాకు 200 డాలర్లు చెల్లించినట్లు వెల్లడి
▪️ కోవిడ్ తర్వాత ఆన్‌లైన్ సినిమా వీక్షకులు పెరిగారని రవి అంగీకారం
▪️ కోవిడ్ అనంతరం తన వ్యాపారం భారీగా పెరిగిందని విచారణలో వెల్లడి
▪️ రవి నిర్వహించిన 7 బ్యాంక్ ఖాతాల్లో రూ.13.40 కోట్ల లావాదేవీలు
▪️ ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్ ద్వారా ఒకే సారి రూ.1.78 కోట్లు ఆదాయం
▪️ ట్యాక్స్ సమస్యలు రాకుండా సోదరి చంద్రికకు రూ.90 లక్షల బదిలీ
▪️ లావాదేవీలన్నీ విదేశీ కరెన్సీ రూపంలోనే నిర్వహించిన రవి
▪️ కూకట్పల్లి ఉషా ముల్లపూడి సమీపంలో కార్యాలయం నిర్వహణ
▪️ పైరసీ కోసం పది మందిని నియమించుకున్నట్లు గుర్తింపు
▪️ రాకేష్ అనే విదేశీయుడి ద్వారా ట్రేడ్‌మార్క్ లైసెన్స్
▪️ బెట్టింగ్, పైరసీ డబ్బుతో విలాసవంతమైన జీవితం
▪️ 12 రోజుల కస్టడీ అనంతరం ఐబొమ్మ రవిని జైలుకు తరలింపు
►ALSO READ | యూట్యూబర్ అన్వేష్పై కరాటే కళ్యాణి ఫిర్యాదు.. పంజాగుట్ట పీఎస్లో కేసు నమోదు
