రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్​ఎంఆర్​ గార్డెన్​లో ఆర్టీఏ మెంబర్ అభిగౌడ్​ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ప్రమాద నివారణల పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కలెక్టర్​చీఫ్​గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌగోళికంగా జిల్లాలో నేషనల్​ హై వే, ప్రధాన రహదారులు ఎక్కవ విస్తీర్ణంతో ఉన్నాయని, వాహనదారులు ట్రాఫిక్​ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. 

ఎవరైనా డ్రగ్స్​తీసుకుంటున్నట్లు గమనిస్తే వెంటనే తమకు సమాచారం ఇస్తే వారికి రూ.10 వేలు రివార్డు ఇస్తామన్నారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, డీటీవో శ్రీనివాస్​ గౌడ్, వివిధ కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంతకముందు కలెక్టర్​ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో జిల్లాస్థాయి పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్టేడియంలో జెండావిష్కరణ చేశారు.