జనగామ అర్బన్, వెలుగు : బొమ్మ గన్ ఉపయోగించి డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం జనగామ పీఎస్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఎస్సై ఎం.భరత్ వివరాలు వెల్లడించారు.
సిద్దిపేట రోడ్డులోని సింధు లిక్కర్ మార్ట్లో మల్లిగారి సతీశ్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తుండగా, నిందితుడు రఘనాథపల్లి మండలం గబ్బెటకు చెందిన ఇంజ ప్రశాంత్ తన వద్ద ఉన్న బొమ్మ గన్ను సతీశ్తలపై గురిపెట్టి రూ. 5 వేలు డబ్బు ఇవ్వు లేకుంటే చంపుతానని బెదిరించాడు. సతీశ్ పోలీసులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని జనగామ చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకుని బొమ్మ తుపాకీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
