స్టార్టర్‌లో తాచుపాము.. తప్పిన ప్రమాదం

స్టార్టర్‌లో తాచుపాము.. తప్పిన ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా: మోటర్ పంపు స్టార్టర్ రిపేరింగ్‌కు వెళ్లిన ఎలక్ట్రీషియన్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. షాక్ అంటే కరెంట్ షాక్ కాదులెండీ. రిపేర్ చేయడానికి స్టార్టర్‌ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో పెద్ద తాచుపాము పడుకుని ఉంది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కపడ్డ ఎలక్ట్రీషియన్..చాకచక్యంగా వ్యవహారించి పామును బయటకు తీశాడు. ఈ సంఘటన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.

వివరాలు: భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామం పరిధిలోని ఖమ్మగూడెం  ప్రైవేట్ స్కూల్‌లో మోటర్ రిపేరింగ్ అయ్యింది. బాగు చేయడానికి వెళ్లిన ఎలక్ట్రీషియన్ శేఖర్(25) మోటర్ స్టార్టర్‌ను ఓపెన్ చేశాడు. వెంటనే బుస్సుమంటూ తాచుపాము పడగ విప్పిందట. కొంచెమైతే కాటు వేసేదని తెలిపాడు ఎలక్ట్రీషియన్ శేఖర్. కరెంట్ ఉంటే‌ షాట్‌ సర్క్యూట్‌ అయి అగ్ని ప్రమాదం జరిగి ఉండేదని తెలిపాడు. ఎలాంటి ప్రమాదం లేకుండా పామును స్థానికుల సాయంతో భయటకు తీసి చంపేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వర్షాకాలం కావడంతో పాము మోటర్ స్టార్టర్‌లోకి దూరి ఉండొచ్చని.. విద్యుత్ పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు విద్యుత్ అధికారులు.