న్యూఢిల్లీ : వెండి ధర గురువారం రూ. 1,800 పెరిగి తాజా రికార్డు గరిష్ట స్థాయి రూ.88వేలను తాకగా, అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.650 పెరిగి రూ.74,050లకు చేరాయి. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ప్రకారం, వెండి ధరలు ఢిల్లీలో
రూ.1,800 పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి రూ.88,700కి చేరాయి. క్రితం సెషన్‌లో కిలో ధర రూ.86,900 వద్ద ముగిసింది. బంగారం పది గ్రాముల ధర రూ.650 పెరిగి రూ.74,050 కి ఎగబాకింది. క్రితం సెషన్‌లో 10 గ్రాముల ధర రూ.73,400 వద్ద ముగిసింది.
