
న్యూఢిల్లీ : టీవీలు, ఫ్యాన్‌లు వంటి కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్‌లను తయారు చేసే ఏసర్ గ్రూప్ కంపెనీ ఏసర్‌ప్యూర్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. డిక్షన్ టెక్నాలజీతో కలిసి లోకల్‌గా ప్రొడక్ట్‌లను తయారు చేస్తామని పేర్కొంది. బెంగళూరులో గురువారం 65 ఇంచుల టీవీని ఏసర్‌ప్యూర్ లాంచ్ చేసింది. ఇండియా తమకు చాలా కీలకమైన మార్కెట్ అని
ఇక్కడ బిజినెస్ చేయడానికి స్పెషల్ స్ట్రాటజీ అవసరమని ఏసర్ గ్రూప్ ప్రెసిడెంట్ (ఆసియా–పసిఫిక్) ఆండ్రూ హౌ అన్నారు. అందుకే ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి టైమ్ పట్టిందని పేర్కొన్నారు. తమ ప్రొడక్ట్‌లకు జపాన్, సింగపూర్, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్‌లో మంచి స్పందన వస్తోందని అన్నారు.