బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్న : ఎమ్మెల్యే మందుల సామేల్

బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్న : ఎమ్మెల్యే మందుల సామేల్
  •     ఎమ్మెల్యే మందుల సామేల్ 

హైదరాబాద్, వెలుగు: బ్రాహ్మణులపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ఎమ్మెల్యే మందుల సామేల్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని బ్రాహ్మణ సమాజం తన మాటల వల్ల మనస్తాపం చెందితే ఆ మాటలను వాపస్​ తీసుకుంటున్నానని తెలిపారు. తన  నియోజకవర్గంలోని బ్రాహ్మణులతో తాను ఎప్పుడూ సఖ్యతగానే ఉంటానన్నారు. 

ఈ చిన్న విషయాన్ని పట్టుకొని బీజేపీ నేతలు అనవసరంగా రాజకీయం చేయడం మానుకోవాలని కోరారు. వివాదాలకు స్వస్తి పలికి అందరం కలిసి ఉండాలన్నదే తన అభిమతమని ఆయన స్పష్టం చేశారు.