ఎల్పీజీ గ్యాస్ పై ఆందోళన వద్దు సరిపడా స్టాక్ ఉంది: కలెక్టర్

ఎల్పీజీ గ్యాస్ పై  ఆందోళన వద్దు సరిపడా స్టాక్ ఉంది: కలెక్టర్

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో సమృద్ధిగా సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు.  

సిలిండర్లు పక్కదారి పట్టకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు ప్రత్యేక మానిటరింగ్ కమిటీని కూడా నియమించినట్లు చెప్పారు. ఏవైనా సమస్యలు ఉంటే 7989868271 నంబర్​కు కాల్ చేయాలని సూచించారు. సోషల్​ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, జిల్లాలో గ్యాస్ కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.