పాట్నాలో బీపీఎస్సీ అభ్యర్థుల ఆందోళన

పాట్నాలో బీపీఎస్సీ అభ్యర్థుల ఆందోళన

పాట్నాలో బీపీఎస్సీ (BPSC) (బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ) అభ్యర్థులు.. పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరీక్షల షెడ్యూల్ కు వ్యతిరేకంగా వారు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై భారీ సంఖ్యలో వచ్చిన అభ్యర్థులు బైఠాయించారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఒక్కసారిగా వారిపై లాఠీఛార్జీ చేశారు. విద్యార్థులు రోడ్లపై పరుగులు తీశారు.

దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. పలువురు అభ్యర్థులకు గాయాలయైనట్లు సమాచారం. ముందుగా 67వ కంబైన్డ్ కాంపిటీటివ్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీని విడుదల చేసింది. సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 22వ తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. పరీక్షలను ఒకే షిప్ట్ లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. పోలీసుల జరిపిన లాఠీఛార్జీని ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. వాస్తవానికి మే 08న పరీక్ష జరగాల్సి ఉంది. ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందన్న ఆరోపణలతో పరీక్షను రద్దు చేశారు.