బావ బామ్మర్ధులు బైక్​ దొంగలు 

బావ బామ్మర్ధులు బైక్​ దొంగలు 

డూప్లికేట్​ కీలతో చోరీలు 

రూ. 2 లక్షల విలువైన 5 బైకులు సీజ్

జల్సాలకు అలవాటు పడి బైకుల చోరీలకు పాల్పడుతున్న   బావ బామ్మర్ధులను  జవహర్​నగర్​ పోలీసులు అరెస్టు చేశారు.  మంగళవారం  జవహర్​ నగర్​ పోలీస్​స్టేషన్​లో  ఏసీపీ  శివకుమార్​ వివరాలు వెల్లడించారు. సిద్దిపేట్​ జిల్లా, కోహెడ మండలం, మైసంపల్లి గ్రామానికి చెందిన తాండూరి శంకర్​ (27), దులం హరిశ్​​ అలియాస్​ హరి (23) బావ బామ్మర్ధులు.

కొంత కాలంగా  జవహర్​ నగర్​ పరిధిలోని అంబేద్కర్​ నగర్​, విఠల్​ రావు నగర్​కు వచ్చి వీరిద్దరూ పేయింటింగ్​ వర్క్​ చేస్తుండేవారు.    మూడు నెలలుగా డూప్లికేట్​ కీ లతో బైకుల చోరీలు చేయడం మొదలు పెట్టారు.  అంబేద్కర్​ నగర్​లోని దారా వైన్స్​ వద్ద  తన బైక్​ చోరీ అయ్యిందని ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైన్స్​ వద్ద  ఉన్న సీసీ పుటేజ్​ను పరిశీలించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో రోటీన్​గా  వెహికిల్​ చెకింగ్​ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. జవహర నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని బాలాజీ నగర్​, ప్రగతి నగర్​, దేవేందర్​ నగర్​, అంబేద్కర్​ నగర్​లలో 4 బైకులు, సిద్దిపేట్​లో ఒక  బైకును చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు.   నిందితుల వద్దనుండి రూ.2 లక్షల   విలువచేసే 5 బైకులను సీజ్​ చేసి రిమాండ్​కు తరలించామని ఏసీపి శివకుమార్ తెలిపారు.  సమావేశంలో జవహర్​ నగర్​ ఇన్​స్పెక్టర్​ భిక్షపతి రావు, డిటెక్టివ్​ ఇన్​స్పెక్టర్​ నర్సింగ్ రావు, డిటెక్టివ్​ సబ్​ఇన్​స్పెక్టర్​ సైదులు, క్రైం టీం మెంబర్స్​ పాల్గొన్నారు.