7.26 లక్షల మందితో జేపీ నడ్డా మీటింగ్

7.26 లక్షల మందితో  జేపీ నడ్డా మీటింగ్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ కమిటీ సమ్మేళనాలు ప్రారంభించింది. 34,600 బూత్ కమిటీలకు చెందిన 7.26 లక్షల మంది కార్యకర్తలను ఉద్దేశిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వర్చువల్​గా మాట్లాడుతారు. 63591 19119 అనే నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడంతో ఈ సమ్మేళనంలో పార్టీ కార్యకర్తలు భాగస్వాములవుతారు. 

ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల దాకా జేపీ నడ్డా మాట్లాడుతారు. ఈ సమ్మేళనంలోనే ‘సరళ్’ యాప్ ను ప్రారంభించనున్నారు. సరళ్ యాప్ ద్వారా బీజేపీ పార్టీని బలోపేతం చేయడం, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి సెగ్మెంట్​లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడకుండా పార్టీ తరఫున ఐటీ టీమ్ లను ఏర్పాటు చేశారు.

ఈ సమ్మేళనంలో పలువురు పార్టీ ముఖ్య నేతలు వివిధ నియోజకవర్గాల్లో పాల్గొంటారు. జూబ్లీహిల్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముషీరాబాద్ లో ఎంపీ లక్ష్మణ్, ధర్మపురిలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, కూకట్ పల్లిలో విజయశాంతి, గద్వాల్ లో డీకే అరుణ, మహబూబ్ నగర్ లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మెదక్ లో ధర్మపురి అర్వింద్, దుబ్బాకలో రఘునందన్ రావు పాల్గొంటారు. రాష్ట్ర కార్యాలయం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రసంగించనున్నారు. 

మిషన్ 90లో భాగంగా సంస్థాగత నిర్మాణంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఫిబ్రవరి మెదటి వారం నాటికి 34,600 బూత్ కమిటీలను 100 శాతం పూర్తి చేయాలని లక్ష్యంగా ముందుకెళ్తోంది. బూత్ కమిటీల కు ప్రత్యేకంగా ఐడీ కార్డ్ లు, డైరీలు ఇచ్చారు.