దక్షిణ ఇరాన్ లో అమెరికా యుద్ద విమానం కూల్చివేతపై ఐఆర్ జీసీ కీలక అప్డేట్ ఇచ్చింది. శుక్రవారం ఉదయం అమెరికాకు చెందిన ఫైటర్ జెట్ F15ని కూల్చివేశామని ప్రకటించిన ఐఆర్ జీసీ.. తాజాగా ఆ పైలట్ ఇరాన్ లోనే ల్యాండ్ అయినట్లు ప్రకటించింది. దక్షిణ ఇరాన్ ప్రాంతంలో పారాచూట్ ద్వారా పైలట్ ల్యాండ్ అయ్యాడని, ఆప్రాంతంలోని ఇరాన్ పౌరుల చేతిలో ఫైటర్ జెట్ పైలట్ బందీగా ఉండొచ్చని తెలిపింది. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది ఐఆర్ జీసీ. పైలట్ పట్టుబడితే అతనికి ఎలాంటి హాని కలిగించొద్దంటూ తన సోషల్ మీడియా X లో పోస్ట్ చేసింది.
శుక్రవారం( ఏప్రిల్3) మధ్య ఇరాన్ గగనతలంలోకి ఐఆర్ జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ కు చెందిన కొత్త అడ్వాన్డ్స్ రక్షణ వ్యవస్థతో అమెరికా కు చెందిన రెండో F-15E యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఐఆర్ జీసీ ప్రకటించింది. ఈ యుద్ద విమానం లేకెన్ హీత్ స్క్వాడ్రన్ కు చెందినదని తెలిపింది. అంతకుముంద పైలట్‌ను పట్టుకునేందుకు ఆ ప్రాంత పౌరులు సహాయపడాలని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా ఛానల్ కోరింది. తాజాగా పైలట్ ను పట్టుకున్నా హాని కలిగించొద్దంటూ ట్వీట్ చేసింది.
అయితే విమానాన్ని కూల్చివేయడంపై యూఎస్ సెంట్రల్ కమాండ్, పెంటగాన్,వైట్ హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అమెరికా యుద్ధవిమానాన్ని ఇరాన్ కూల్చివేసిందని, ఇద్దరు సిబ్బందిని గుర్తించేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అమెరికా వార్తా సంస్థ ఆక్సియోస్ నివేదించింది.
అమెరికా సీక్రెట్ రెస్క్యూ ఆపరేషన్!
తమ ఫైటర్ జెట్ కూలిపోయిన వెంటనే అలర్ట్ అయిన అమెరికా దళాలు.. పైలట్ ప్రాణాలతోనే ఉన్నాడని పసిగట్టాయి. శత్రు దేశమైన ఇరాన్ చేతికి తమ పైలట్ చిక్కకముందే అతన్ని అక్కడి నుంచి సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి అమెరికా దళాలు తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. ఇరాన్ భూభాగంలోనే ఒక 'కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదని, పైలట్ ఇరాన్ కస్టడీలోకి వెళ్లిపోయారని తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
►ALSO READ | పాకిస్తాన్‌లో చుక్కలు చూపిస్తున్న పెట్రోల్ ధరలు.. లీటర్ ఎంతంటే!
ఇప్పటికే ఇరాన్ - ఇజ్రాయెల్ - అమెరికాల మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగాన్ని తలపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏకంగా అమెరికా యుద్ధ విమానం నేలకూలడం, పైగా అమెరికన్ పైలట్ ఇరాన్ చేతికి బందీగా చిక్కడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ ఘటనపై అమెరికా పెంటగాన్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
🚨Many people in southwestern Iran have gone to the area around the crash site of the American fighter jet in private cars to #capture the American pilot.
— IRIB (Islamic Republic of Iran Broadcasting) (@iribnews_irib) April 3, 2026
The Iranian armed forces have called on the people NOT TO LET anyone mistreat the pilot.
