సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ యూనిట్ ఏ మాత్రం బాగోలేదని వస్తోన్న విమర్శలకు ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేకేఆర్‌పై విజయం అనంతరం నితీష్ మీడియాతో మాట్లాడుతూ.. తమ బౌలింగ్ విభాగం అనుభవం, యువతతో కలగలిసి ఉందని పేర్కొన్నాడు. బ్యాటింగ్‌తో సమానంగా బౌలింగ్ దళం కూడా బలంగా ఉందని.. కొందరు అంటున్నట్లుగా బౌలింగ్‌లో తాము బలహీనమైన జట్టు కాదని విమర్శకుల నోర్లు మూయించాడు.
తమ జట్టులో జయదేవ్ ఉనద్కత్, ఈషాన్ మలింగ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారని.. అలాగే పేన్ కూడా చాలా బాగా రాణిస్తున్నాడని తెలిపారు. బహుశా మేం బ్యాటింగ్‌లో భారీ స్కోర్లు చేస్తుండటం వల్ల బౌలింగ్ యూనిట్ వీక్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది కావచ్చు.. అంతే తప్ప తమ బౌలింగ్ విభాగం బలహీనంగా మాత్రం లేదని బౌలర్లకు మద్దతుగా నిలిచాడు.
హైదరాబాద్ వంటి ప్లాట్ పిచ్‌లపై బౌలింగ్ చేయడం సవాల్‌తో కూడుకుందని.. అలాంటి పరిస్థితుల్లో కూడా మా బౌలింగ్ విభాగం కేకేఆర్‌పై సమర్థవంతంగా బౌలింగ్ చేసి లక్ష్యాన్ని కాపాడుకుందని తెలిపారు. కాబట్టి బౌలింగ్‌లో మేం వీక్ ఉన్నామంటే తాను ఒప్పుకోనని.. మా బ్యాటింగ్ విభాగం విధ్వంసకరంగా ఉండటంతో కొందరికి ఆ అభిప్రాయం కలగవచ్చని విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు.
►ALSO READ | రూ.25 కోట్ల ప్లేయర్‌ను తీసేయండి.. మీరు గెలవాలంటే అదొక్కటే మార్గం: కేకేఆర్‌కు హర్భజన్ సింగ్ సూచన
ఈ సీజన్లో ఆర్సీబీ చేతిలో తొలి మ్యాచులోనే హైదరాబాద్ ఓటమి పాలైంది. బౌలింగ్ విభాగంగా ఫెయిల్ కావడంతో 200 పైచిలుకు లక్ష్యాన్ని కాపాడుకోలేక హైదరాబాద్ ఓడిపోయింది. ఓటమి నుంచి వెంటనే తేరుకున్న హైదరాబాద్ రెండో మ్యాచులో కేకేఆర్‌పై ఘన విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి లీగులో బోణీ కొట్టింది. ఎస్ఆర్హెచ్ విజయంలో తెలుగు క్రికెటర్, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో 39 రన్స్ చేయడంతో పాటు బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెల్చుకున్నాడు.
