IPL 2026: నితీశ్ ఆల్ రౌండ్ షో.. సిక్సర్లతో హోరెత్తించిన క్లాసెన్,  అభి, హెడ్.. కేకేఆర్పై SRH ఘన విజయం 

IPL 2026: నితీశ్ ఆల్ రౌండ్ షో.. సిక్సర్లతో హోరెత్తించిన క్లాసెన్,  అభి, హెడ్.. కేకేఆర్పై SRH ఘన విజయం 

IPL 2026: ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన హైవోల్టెజ్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక హైదరాబాద్‌ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతాకు ఫిన్ అలెన్ (28) అద్భుతమైన ఆరంభం అందించినప్పటికీ, హర్ష్ దుబే బౌలింగ్‌లో తన వికెట్‌ను కోల్పోవడంతో.. 30 పరుగులకే ఆరెంజ్ ఆర్మీకి తొలి బ్రేక్ త్రూ లభించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రఘువంశీ హాఫ్ సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ అజింక్యా రహానే (8) మాత్రం ఈసారి విఫలమయ్యాడు. కేవలం తక్కువ పరుగులు మాత్రమే చేసి జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన కెమెరూన్ గ్రీన్ (2)ని మరోసారి దురదృష్టం వెంటాడింది. ఎషాన్ మలింగ బౌలింగ్ లో రఘువంశీ కొట్టిన బాల్ కి నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న గ్రీన్ 2 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి కీలకమైన మూడు వికెట్లను కోల్పోయి కేకేఆర్ కష్టాల్లో పడింది. 

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఈ మ్యాచులో చెత్త ఫీల్డింగ్ తో చిరాకు తెప్పించారు. పలు క్యాచులని డ్రాప్ చేయడంతో పాటు ఫీల్డింగ్ తో భారీగా పరుగులను సమర్పించుకున్నారు. ఇక ఎహాఫ్ సెంచరీతో చెలరేగిన అంగక్రిష్ రఘువంశీ ( 29 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సులో 52 పరుగులు) షాన్ మలింగ బౌలింగ్ లో రనౌట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన అనుకూల్ రాయ్ కూడా మళ్లీ తీవ్ర నిరాశ పరిచాడు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ లో ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ఇషాన్ కిషన్ కి క్యాచ్ ఇచ్చి (0) డకౌట్ అయ్యాడు.

ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన ఆరెంజ్ ఆర్మీ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కేకేఆర్ స్టార్ బ్యాటర్ రింకు సింగ్ ( 25  బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సుతో 35 పరుగులు)ని ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చి రాగానే రెండు భారీ సిక్సులు కొట్టి మంచి ఊపుమీద కనిపించిన సునీల్ నరైన్ (12) ఎషాన్ మలింగ బౌలింగ్ లో బౌండరీ లైన్ దగ్గర అనికేత్ వర్మకి క్యాచ్ ఇచ్చి డగౌట్ కి చేరుకున్నాడు. ఇక రమణ్ దీప్ సింగ్ (10) సైతం పెద్దగా రాణించలేదు.. ఎషాన్ మలింగ బౌలింగ్ లో జయదేవ్ ఉనద్కత్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన కార్తిక్ త్యాగి ఇలా వచ్చిన అలా 5 పరుగులు చేసి జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్ లో ఔట్ అయి.. మైదానం వీడాగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్ వరుణ్ చక్రవర్తి క్లిన్ బౌల్డ్ కావడంతో 161 పరుగులకే కేకేఆర్ ఆలౌట్ అయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ కీలకమైన 3 వికెట్లు తీసుకోగా, ఎషాన్ మలింగ,  నితీష్ కుమార్ రెడ్డిలు తలో రెండు వికెట్లు పడగొట్టగా, హర్ష్ దూబే ఒక వికెట్ సొతం చేసుకున్నాడు.