కేంద్రాన్ని బద్నాం చేయడం తగదు

కేంద్రాన్ని బద్నాం చేయడం తగదు

వ్యాట్ తగ్గించేదాకా పోరాటం ఆగదన్నారు మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ.   పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలంటూ కరీంనగర్ లో జరిగిన బీజేపీ దళిత మోర్చా ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె.. వచ్చేఎన్నికల్లో రైతులు  కేసీఆర్ కు గుణపాఠం చెబుతారన్నారు. వానకాలం వడ్లు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్న కేసీఆర్.. ఎండకాలం వడ్ల గురించి మాట్లాడుతున్నారన్నారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన కేసీఆర్ .. ఎర్రిలేసినట్లు మాట్లాడుతున్నారన్నారు. సీఎంకు చేతగాకుంటే ధాన్యం కొనడం  సాధ్యం కాదని అసెంబ్లీలో చట్టం చేసి మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలన్నీ  కేంద్రానికి అప్పగించాలన్నారు.  కేంద్రాన్ని బద్నాం చేయడం తగదన్నారు. ఒక్కరోజు వరి కల్లాల దగ్గర కేసీఆర్ నిద్ర చేయాలన్నారు. ఎమ్మెల్సీ క్యాంపులపై పెట్టిన శ్రద్ధ వినోద్ కుమార్ కు, కేటీఆర్ కు రైతులపై లేదన్నారు.  క్యాంపులకు కాపలా ఉండి మద్యం సరఫరా చేస్తున్నారన్నారు.