చార్మినార్ వద్ద ప్రారంభమైన బొల్లాడ్స్ ఏర్పాటు

చార్మినార్ వద్ద ప్రారంభమైన బొల్లాడ్స్ ఏర్పాటు

గోల్డన్ టెంపుల్ తరహాలో చార్మినార్ చుట్టూ బొల్లాడ్స్

వెలుగు: ‘చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్’ పనుల్లో భాగంగా చార్మినార్ చుట్టూ వాహనాల నియంత్రించేందుకు బొల్లాడ్స్​ల ఏర్పాటు పనులు శనివారం ప్రారంభమయ్యాయి. చార్మినార్‌‌ వైపునకు దారితీసే నాలుగు ప్రధాన మార్గాల గుండా వాహనాలు రాకుండా చేస్తున్నారు. శనివారం గుల్జార్ హౌస్ మార్గంలో  బొల్లాడ్స్ అమ ర్చే  పనులు చేపట్టారు. మొదటి దశలో గుల్జార్ హౌస్‌‌, మక్కా మజీద్ మార్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. రెండో దశలో లాడ్ బజార్, సర్దార్ మహల్ మార్గాల్లో ఏర్పాటు చేస్తారు. అమృత్‌ సర్‌‌ స్వర్ణదేవాలయం పరిసరాల్లో ఉన్న మాదిరిగా చార్మినార్ చుట్టూ   బొల్లాడ్స్ ఏర్పాటు చేయనున్నారు. రూ.2.38 కోట్ల ఖర్చుతో మొత్తం 125 బొల్లాడ్స్​  ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 28 ఆటోమెటిక్ హైడ్రాలిక్ బొల్లాడ్స్ ​ఉన్నట్లు జీహెచ్ ఎంసీ సూపరిండెంటెండ్ ఇంజనీర్ దత్తుపంత్​ తెలిపారు.