
హైదరాబాద్, వెలుగు : ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం జూబ్లీహిల్స్‌లోని మకావు కిచెన్ అండ్ బార్‌లో తనిఖీలు నిర్వహించారు. కస్టమర్లకు సర్వ్ చేస్తున్న ఫుడ్‌పై ఫంగస్ ఉన్నట్లు, బొద్దింకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. ఎక్స్పైర్అయిన చికెన్, బుల్ డాగ్ సాస్, మాలాస్ ఆరెంజ్ మార్మాలాడ్, టిపరోస్ ఫిష్ సాస్, మయోనైస్ తో పాటు ఫంగస్ సోకిన జీడిపప్పును స్వాధీనం చేసుకున్నారు. స్టోర్ ఏరియా అపరిశుభ్రంగా ఉన్నట్లు, బొద్దింకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. యజమానికి నోటీసులు జారీ చేశారు. చట్ట ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.