100 సబ్స్క్రైబర్స్ .. బాలుడికి ఫ్రెండ్ విలువైన గిఫ్ట్

100 సబ్స్క్రైబర్స్ .. బాలుడికి ఫ్రెండ్ విలువైన గిఫ్ట్

చాలా సార్లు మనం ఏదైనా పని చేసేటప్పుడు వెనకాల కనీసం ఒక్క వ్యక్తి అయినా తోడుగా లేదంటే.. ఎంకరేజ్ చేసే వాళ్లుంటే బాగుండు అనుకుంటాం. అలాంటి సందర్భాల్లో ఎక్కువ శాతం తోడుండి ముందుకు నడిపే వాళ్లే స్నేహితులు. సంతోషాన్నే కాదు... బాధలోనూ, కష్టంలోనూ ఒకే రకంగా మనవైపు, మనతో ఉండేవాళ్లే నిజమైన నేస్తాలు. అలాంటి ఎంకరేజ్ మెంట్ మన వెనక ఉంటే.. కష్టం కూడా ఇష్టంగానే ఉంటుంది. బాధ కూడా సంతోషంగానే అన్పిస్తుంది. దానికి ఉదాహరణే ... ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఓ చిన్న పిల్లాడి కథ. ఓ బాలుడి యూ ట్యూబ్ ఛానెల్ 100 సబ్ స్ర్కైబర్స్ ను చేరిన సందర్భంగా.. ఆ పిల్లాడి ఫ్రెండ్ ఆ బాలునికి విలువైన బహుమతి ఇచ్చాడు. మామూలుగా యూట్యూబ్ లో లక్ష సబ్ స్ర్కైబర్స్ వస్తే సిల్వర్, 10 లక్షలు వస్తే గోల్డ్ బటన్ రావడం చూస్తూనే ఉంటాం. అలా అని ఈ బాలుడికి వచ్చింది సిల్వరో, బంగారమో కాదు... ఆ బాలుడు ఇచ్చింది చెక్క ప్లే బటన్. చూడడానికి ఆఫ్ర్టాల్ చెక్క లాగానే అనిపించినా.. ఎంతో ప్రేమతో ఇచ్చాడు కాబట్టే... దాన్ని విలువైంది అనడంలో తప్పేం లేదేమో..

ఈ విషయాన్ని ఆ బాలుడి తండ్రి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ... ఈ చెక్క ప్లే బటన్ ను నా కొడుకు యూట్యూబ్ ఛానెల్ 100 సబ్ స్క్రైబర్లను రీచ్ అయిన సందర్భంగా..తన ఫ్రెండ్ ఇది తయారుచేసి ఇచ్చాడని పేర్కొన్నాడు. దీంతో పాటు ఆ చెక్క ప్లే బటన్ ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు. నిజానికి ఆ బాలుడు సాధించింది అక్కడ పెద్ద విజయమేం కాదు. కానీ.. తన ఫ్రెండ్ ను ఎంకరేజ్ చేయడం కోసం, జీవితంలో మరింత ముందుకు సాగాలని ఆ బాలుడు చేసిన పనిని చూస్తే ఎవరికైనా మనసు కరగకపోదు. వారి స్నేహాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. అయితే ఆ బాలుడి తండ్రి షేర్ చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. నెటిజన్లు పలురకాలుగా కామెంట్ చేస్తున్నారు.