పారాసిటమాల్ పంపించినందుకు థ్యాంక్స్

పారాసిటమాల్ పంపించినందుకు థ్యాంక్స్

లండన్ : కరోనా కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్న బ్రిటన్ కు 3 మిలియన్ల పారాసిటమాల్ ప్యాకెట్స్ ను భారత్ పంపించింది. ఆదివారం ఇవి బ్రిటన్ కు చేరుకోనున్నాయి. తమ విజ్ఞప్తిని మన్నించి ట్యాబ్లెట్లు పంపించినందుకు భారత్ కు బ్రిటన్ థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుత క్రైసైస్ లో భారత్ చేసిన సాయం రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని బ్రిటన్ ఫారెన్ అండ్ కామన్ వెల్త్ ఆఫీసర్ తారిక్ అహ్మద్ చెప్పారు. ” కరోనా మహమ్మరిని తరిమికొట్టేందుకు బ్రిటన్, ఇండియా కలిసి పనిచేస్తాయి. మా అభ్యర్థనను మన్నించి పారాసిటమాల్ ట్యాబ్లెట్లు పంపించినందుకు భారత్ కు ధన్యవాదాలు ” అని తారిక్ అహ్మద్ అన్నారు. కరోనా కారణంగా అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ ల తర్వాత బ్రిటన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతోంది. కరోనా బాధితులను ట్రీట్ చేసేందుకు పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ను వినియోగిస్తున్నారు.
స్వదేశానికి సింగపూర్ పౌరులు
లాక్ డౌన్ కారణంగా భారత్ లో చిక్కుకుపోయిన సింగపూర్ పౌరులు తిరిగి వారి దేశానికి చేరుకున్నారు. దాదాపు ఏడువందల మంది సింగపూర్ పౌరులను ఢిల్లీ, ముంబై, చెన్నైల నుంచి ప్రత్యేక విమానాల్లో వారి దేశాలకు పంపించారు. ఇందుకు సహకరించిన భారత్ కు ఆ దేశ విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది.