అట్టారి స‌రిహ‌ద్దులో స్వీట్లు పంచుకున్న భార‌త్, పాక్ సైన్యం

అట్టారి స‌రిహ‌ద్దులో స్వీట్లు పంచుకున్న భార‌త్, పాక్ సైన్యం

దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు జరుగుతున్నాయి.  ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రార్ధనలు చేస్తున్నారు.  ఈ సందర్భంగా అట్టారి, -వాఘా సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్ ) జవాన్లు, పాకిస్తాన్ రేంజర్లు ఒకరికొకరు స్వీట్లు మార్చుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంతో పాటుగా పలు పండగ సమయాలలో ఇలా ప్రతి ఏడాది బార్డర్ వద్ద స్వీట్లు పంచుకుంటారు.  ఇది సంప్రదాయకంగావస్తోంది. కాగా మహ్మద్‌ ప్రవక్త హజ్రత్‌ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా ముస్లింలు బక్రీద్‌  పండగను జరుపుకొంటారు. రంజాన్ తరువాత ముస్లింలు ప్రధానంగా జరుపుకునే పండగ ఇది.