బెంగాల్‌‌కు ‘బుల్‌‌బుల్‌‌’ ఎఫెక్ట్‌‌: ఏడుగురు మృతి

బెంగాల్‌‌కు ‘బుల్‌‌బుల్‌‌’ ఎఫెక్ట్‌‌: ఏడుగురు మృతి

కోల్‌‌కతా: పశ్చిమ బెంగాల్‌‌ను ‘బుల్‌‌ బుల్‌‌’ సైక్లోన్‌‌ ముంచెత్తింది. ఆదివారం ఉదయం భారీ గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. పెద్ద పెద్ద చెట్లు నేలకొరగడంతో చాలా చోట్ల ట్రాన్స్‌‌పోర్ట్‌‌కు అంతరాయం కలిగింది. పవర్‌‌‌‌ కట్‌‌ కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌, కోల్‌‌కతా మున్సిపల్‌‌, ఫైర్‌‌‌‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ‘బుల్‌‌ బుల్‌‌’ తుపానుపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌‌ షా సమీక్షించారు. ‘తుపానుపై మమతా బెనర్జీతో మాట్లాడాను, కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చాను. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని మోడీ ట్వీట్‌‌ చేశారు