మార్చిలో స్పెక్ట్రమ్‌ వేలానికి కేబినెట్​ ఆమోదం

మార్చిలో స్పెక్ట్రమ్‌ వేలానికి కేబినెట్​ ఆమోదం

ఈ నెలలోనే నోటిస్‌‌ విడుదల

షుగర్‌‌‌‌ ఎక్స్‌‌పోర్ట్స్‌‌కు రూ. 3,500 కోట్ల సబ్సిడీ

న్యూఢిల్లీ: నెక్స్ట్‌‌‌‌ రౌండ్‌‌‌‌ స్పెక్ట్రమ్‌‌‌‌ వేలానికి కేంద్ర కేబినేట్‌‌‌‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఆక్షన్‌‌‌‌లో 5జీ సర్వీస్‌‌‌‌ల కోసం గుర్తించిన ఫ్రిక్వెన్సీలను ప్రభుత్వం అమ్మడం లేదు.  స్పెక్ట్రమ్‌‌‌‌ ఆక్షన్‌‌‌‌ను చేపట్టడంపై డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ టెలికమ్యూనికేషన్‌‌‌‌(డాట్‌‌‌‌) సబ్మిట్‌‌‌‌ చేసిన ప్రపోజల్స్‌‌‌‌ కేబినేట్‌‌‌‌ ఆమోదించిందని కమ్యూనికేషన్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ రవి శంకర్ ప్రసాద్‌‌‌‌ పేర్కొన్నారు. అప్లికేషన్లను స్వీకరించడానికి ఈ నెలలోనే నోటిస్‌‌‌‌ విడుదల అవుతుందని, మార్చిలో వేలం ఉంటుందని పేర్కొన్నారు.

  ఈ ఆక్షన్‌‌‌‌ ద్వారా  700 , 800, 900, 1,800, 2,100, 2,300, 2,500 మెగా హెట్జ్ ఫ్రిక్వెన్సీ బ్యాండ్స్‌‌‌‌ను ప్రభుత్వం వేలం వేయనుంది. ఈ స్పెక్ట్రమ్‌‌‌‌ను  20 ఏళ్ల వ్యాలిడిటీతో కంపెనీలకు ప్రభుత్వం ఆఫర్ చేస్తోంది. రూ. 3,92,332.70 కోట్లు(రిజర్వ్‌‌డ్ ప్రైస్‌‌‌‌) విలువైన 2,251.25 మెగా హెట్జ్ స్పెక్ట్రమ్‌‌‌‌ను ప్రభుత్వం వేలం వేయనుంది. టెలికాం కంపెనీల నుంచి స్పెక్ట్రమ్‌‌‌‌ యూసేజి ఛార్జీ కింద టెలికాం మినిస్ట్రీ 5 శాతం రెవెన్యూను పొందుతుంది. ఈ  వాటాను కంపెనీల స్పెక్ట్రమ్‌‌‌‌ హోల్డింగ్‌‌‌‌ బట్టి లెక్కిస్తారు. కమ్యూనికేషన్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ ద్వారా ఈ కంపెనీలకు వచ్చిన రెవెన్యూలో 8 శాతం వాటా లైసెన్స్‌‌‌‌ ఫీజు కింద ఈ మినిస్ట్రీకి అందుతుంది. ఆక్షన్‌‌‌‌ ద్వారా స్పెక్ట్రమ్‌‌‌‌ను పొందిన కంపెనీలు తమ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ కెపాసిటీని మరింత పెంచుకోవడానికి వీలుంటుంది. కొత్త కంపెనీలయితే తమ సర్వీస్‌‌‌‌లను స్టార్ట్ చేసుకోవచ్చు.

 

అమెరికా-ఇండియా మధ్య ఒప్పందం..

ఎలక్ట్రిసిటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఇండియా–అమెరికాల ప్రయోజనాలకు ఉపయోగపడే సమాచారాన్ని పంచుకునే ఒప్పందానికి కేబినేట్‌‌‌‌ బుధవారం ఆమోదం తెలిపింది. త్వరలో సెంట్రల్‌‌‌‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌‌‌‌, ఫెడరల్‌‌‌‌ ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్‌‌‌‌లు ఓ ఎంఓయూను కుదుర్చుకోనున్నాయి. గ్రిడ్‌‌‌‌ల  మన్నికను మెరుగుపరచడానికి, పవర్ మార్కెట్లో సామర్ధ్యాన్ని పెంచడానికి అవసరమయ్యే పాలసీలను తేవడానికి ఈ ఎంఓయూ ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.

టెలికాం సెక్టార్‌‌‌‌‌‌‌‌లో సెక్యూరిటీ మెరుగు

కమ్యూనికేషన్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో సెక్యూరిటీని మరింత మెరుగుపరిచేందుకు నేషనల్‌‌‌‌ సెక్యూరిటీ డైరక్టివ్‌‌‌‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ప్రభుత్వం లిస్ట్ చేసిన సోర్స్‌‌‌‌ నుంచే ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ను టెలికాం కంపెనీలు కొనుక్కోవాల్సి ఉంటుంది.  నేషనల్‌‌‌‌ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఈ డైరక్టివ్‌‌‌‌ను తీసుకొచ్చామని రవి శంకర్ ప్రసాద్‌‌‌‌ అన్నారు. డిప్యూటీ నేషనల్‌‌‌‌ సెక్యూరిటీ అడ్వైజరీ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ ఈ సోర్స్‌‌‌‌లు, ప్రొడక్ట్‌‌‌‌లను గుర్తిస్తుంది.

నార్త్‌‌ ఈస్టర్న్ రాష్ట్రాలలో పవర్‌‌‌‌ ట్రాన్స్‌‌మిషన్ ప్రాజెక్ట్‌‌లు..

నార్త్‌‌ ఈస్టర్న్​ రాష్ట్రాలలో పవర్‌‌‌‌ సిస్టమ్‌‌ను మెరుగుపరచడానికి అంచనావేసిన రూ. 6,700 కోట్ల ఖర్చును ప్రభుత్వం ఆమోదించింది. ఆరు రాష్ట్రాలలో పవర్‌‌‌‌ ట్రాన్స్‌‌మిషన్‌‌, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్‌‌ను డెవలప్‌‌ చేసేందుకు ఈ డబ్బులు ఖర్చు చేయనున్నారు. ‘ప్రధాని మోడీ నాయకత్వంలోని కేబినేట్‌‌ కమిటీ ఆన్ ఎకానమిక్ అఫైర్స్‌‌,  నార్త్‌‌ ఈస్టర్న్ రీజియన్‌‌ పవర్‌‌‌‌ సిస్టమ్‌‌ ఇంప్రూవ్‌‌మెంట్‌‌ ప్రాజెక్ట్స్‌‌(ఎన్‌‌ఈఆర్‌‌‌‌పీఎస్‌‌ఐపీ) కోసం సవరించిన రూ. 6,700 కోట్లను ఆమోదించింది’ అని ప్రభుత్వం తెలిపింది. ఈ స్కీమ్‌‌ను ప్రభుత్వ కంపెనీ పవర్‌‌‌‌ గ్రిడ్‌‌ అమలు చేయనుంది. అస్సాం, మణిపూర్‌‌‌‌, మేఘాలయా, మిజోరం, నాగలాండ్‌‌, త్రిపుర రాష్ట్రాలలో పవర్ ట్రాన్స్‌‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌‌ నెట్‌‌వర్క్‌‌ను ప్రభుత్వం మెరుగుపరచనుంది.

షుగర్‌‌‌‌ ఎగుమతిదారులకు గుడ్‌న్యూస్

మార్కెటింగ్‌‌ ఇయర్‌‌‌‌ 2020–21 లో 60 లక్షల టన్నుల షుగర్‌‌‌‌ను ఎగుమతి చేసినందుకు షుగర్‌‌‌‌ మిల్లులకు రూ. 3,500 కోట్ల సబ్సిడీని ఇవ్వాలని కేబినేట్‌‌ నిర్ణయించుకుంది. చెరకు రైతుల బకాయిలను  షుగర్ మిల్స్‌‌ తీర్చడంలో ఈ చర్య సాయపడుతుందని అంచనావేసింది. డొమెస్టిక్‌‌గా 260 లక్షల టన్నుల డిమాండ్‌‌ ఉంటే, ఏకంగా 310 లక్షల టన్నుల ప్రొడక్షన్‌‌ జరిగిందని, దీంతో చెరుకు రైతులు, షుగర్‌‌‌‌ ఇండస్ట్రీ  నష్టాల్లో ఉందని బ్రాడ్‌‌కాస్టింగ్‌‌ మినిస్టర్ ప్రకాశ్‌‌ జవదేకర్ అన్నారు. కేబినేట్‌‌ తీసుకున్న ఈ నిర్ణయం వలన 5 కోట్ల మంది రైతులు లాభపడతారని చెప్పారు. మార్కెటింగ్‌‌ ఇయర్ 2019–2020 లో టన్ను ఎక్స్‌‌పోర్ట్‌‌పై రూ. 10,448 ల సబ్సిడీని ప్రభుత్వం ఇచ్చింది. మొత్తం రూ. 6,268 కోట్లను దీని కోసం వినియోగించింది. మిల్లులు 2019–2020 (అక్టోబర్‌‌‌‌–సెప్టెంబర్‌‌‌‌) లో  57 లక్షల టన్నుల షుగర్‌‌‌‌ను ఎగుమతి చేశాయి.