2 మినిట్స్ :నూడుల్స్ తిని ఫ్యామిలీ మొత్తం ఆస్పత్రిలో.. పదేళ్ల బాలుడి చనిపోయాడు..

2  మినిట్స్ :నూడుల్స్ తిని ఫ్యామిలీ మొత్తం ఆస్పత్రిలో.. పదేళ్ల బాలుడి చనిపోయాడు..

పిల్లల నుండి పెద్దల వరకూ ఎక్కువగా ఇష్టపడే ఐటమ్ మ్యాగీ నూడుల్స్.త్వరగా చేసుకోవచ్చన్న కారణంతో పెద్దలు, బ్యాచిలర్స్, ఆఫీసులకు వెళ్లే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తే, టేస్ట్ కోసం పిల్లలు దీన్ని లైక్ చేస్తూ ఉంటారు. దీనికి తోడు ఈ బ్రాండ్ యాడ్స్ కూడా జనంలోకి బాగా వెళ్లాయి. ఎంతలా అంటే, నూడుల్స్ అంటే మ్యాగీ అనేంతలా జనాల్లోకి వెళ్ళింది మ్యాగీ. కానీ, ఆ మధ్య నూడుల్స్ ఆరోగ్యానికి ప్రమాదకరం అని, ప్రత్యేకించి మ్యాగీ నూడుల్స్ హానికరమని ప్రచారం జరిగింది. మ్యాగీలో హానికారక పదార్థాలు లేవని తేలింది.

ఈ క్రమంలో మళ్ళీ నూడుల్స్ వార్తల్లోకి ఎక్కింది. మ్యాగీ నూడుల్స్ తిని పదేళ్ల బాలుడు మృతి చెందగా, ఒక కుటుంబం మొత్తం ఆసుపత్రిలో చేరిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. హజారా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాహుల్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.