పర్మిషన్ లేనిదే మా వాళ్లను తీసుకెళ్లనివ్వం: యూపీ సీఎం యోగి

పర్మిషన్ లేనిదే మా వాళ్లను తీసుకెళ్లనివ్వం: యూపీ సీఎం యోగి

లక్నో: దేశంలోని ఏ రాష్ట్రామైనా సరే ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మైగ్రంట్ వర్కర్స్ ను వెనక్కి రప్పించుకోవాలంటే తప్పనిసరిగా తమ పర్మిషన్ తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. వలస కూలీలకు ఉపాధి కల్పించడానికి ఓ కమిషన్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు యోగి పేర్కొన్నారు. ‘వలస కూలీలు మా అతిపెద్ద వనరులు. వారికి యూపీ స్టేట్ గవర్నమెంట్ లోనే మేం ఎంప్లాయ్ మెంట్ కల్పిస్తాం. దీని కోసం ఓ కమిషన్ ను ఏర్పాటు చేయనున్నాం. ఇన్యూరెన్స్, సోషల్ సెక్యూరిటీ, రీ–ఎంప్లాయ్ మెంట్ అసిస్టెన్స్, అన్ ఎంప్లాయ్ మెంట్ ప్రొవిజెన్స్ లాంటి విషయాలపై ఈ కమిషన్ దృష్టి పెడుతుంది. వలస కూలీల సమాచారంతోపాటు వారి స్కిల్స్ ను రిజిస్టర్ చేశాం. వలస కూలీలు మా ప్రజలు. ఒకవేళ ఏ స్టేట్ అయినా వాళ్లను తిరిగి రప్పించుకోవాలంటే మాత్రం ముందుగా యూపీ స్టేట్ సర్కార్ అనుమతి తీసుకోవాలి. మైగ్రంట్ వర్కర్స్ కు సామాజిక, చట్టపరమైన, మానిటరీ హక్కులను కల్పిస్తామని హామీ ఇవ్వాలి’. అని ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. కొత్త ఉపాధి కల్పన గురించి ఆదిత్యనాథ్ స్పందించారు. జర్మనీకి చెందిన ఓ కంపెనీ తన ప్రొడక్షన్ ఫెసిలిటీని చైనా నుంచి ఇండియాకు తరలిస్తోందన్నారు. ఈ సంస్థ యూపీలోని ఆగ్రాలో 30 లక్షలపైచిలుకు షూస్ ను తయారు చేయనుందన్నారు.