- డాష్ బోర్డులు, మ్యాట్లు , ఇతర విడిభాగాల తయారీ
- పోలండ్ కంపెనీ సెలీనా ‘బయోమోటివ్ ’ ప్రాజెక్టు
- ప్లాస్టిక్ బాటిళ్ల రీసైక్లింగ్‌తో మ్యాట్లు చేస్తున్న ఫోర్డ్ స్పేస్
ట్రాఫిక్ ..ట్రాఫిక్ .. ట్రాఫిక్ .. సిటీలో ఎక్కడ చూసినా అదే బాధ. రోడ్లమీద బారులు తీరే కార్లు. వాటి నుంచే వచ్చే పొగ. వెరసి కాలుష్యం .అటు పొగ, ఇటు సౌండ్ రెండూ వాతావరణానికి ముప్పు తెస్తున్నా యి. చాలా మంది సైంటి స్టులు ఇప్పుడు వాటి నుంచి వచ్చే కార్బన్ డై ఆక్సైడ్ గురిం చే మాట్లా డుతున్నారు. వాటిని తగ్గించేం దుకు కరెంట్ బండ్లు తేవాలంటున్నారు. బాగానే ఉంది. మరి, కారు రోడ్డెక్కకముందే అది రూపుదిద్దుకునే ఫ్యాక్టరీలోనే చర్యలు తీసుకుం టే ఎట్లుం టది? ఏం చేస్తరంటరా..? కార్లకు వాడే ప్లాస్టి క్ ! దాని గురిం చి ఎవరూ పెద్దగా ఆలోచిం చి ఉండరు. ఆ ప్లాస్టి క్ కూడా వాతావరణానికి చెడు చేస్తోంది కదా. దానికి ప్రత్యామ్నాయం వద్దా! అదే ఆలోచన వచ్చింది పోలండ్ లోని సెలీనా ఆనే రీసెర్చ్ సంస్థకు. ఆ కంపెనీకి వచ్చిన సరికొత్త ఆలోచనేంటి ? ఏం చేయాలనుకుం టోంది? పర్యావరణానికి ఎలా మేలు చేయనుంది? ఓ లుక్కేద్దాం!
పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్కు బదులు పర్యావరణానికి మేలు చేసే ప్లాస్టిక్ను తయారు చేయాలని సెలీనా నిర్ణయించింది. ‘బయోమోటివ్’ అనే ప్రాజెక్టును మొదలుపెట్టింది. అందుకు చెట్లు, కలుపు మొక్కలను ఎంచుకుంది. ‘చెట్లు’ అనగానే.. కొట్టేస్తారు కదా, అది మాత్రం పర్యావరణానికి హాని కాదా అన్న డౌట్ రావొచ్చు. ఫుడ్డునివ్వని మొక్కలు, ఉపయోగంలేని చెట్లను మాత్రమే వాడుకుంటారు. ఇక పొలాలు, గట్ల దగ్గర ఉండే కలుపు మొక్కలనూ ఆ ప్రాజెక్టు కోసం వాడుకోనున్నారు. వాటి నుంచి పర్యావరణానికి హాని తలపెట్టని బయోప్లాస్టిక్ను ఉత్పత్తి చేస్తారు. ఆ బయోప్లాస్టిక్తోనే కారు డాష్బోర్డులు, లోపలి భాగాలు, కార్లో ప్లాస్టిక్తో చేసే ఇతర విడిభాగాలను తయారు చేస్తారు. జీవాధారిత వనరుల ద్వారా గాల్లోని కార్బన్ను చాలా వరకు తగ్గించొచ్చని, అందులో భాగంగానే కారు విడిభాగాలు తయారు చేసేందుకు నడుం బిగించామని ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ వోషియెష్ కోమల చెప్పారు. ల్యాబ్లో మొక్కలు, కలుపుల్లో ఉండే రసాయనాలను తీస్తామని, వాటితో సహజసిద్ధంగా పాలిమర్లను (ప్లాస్టిక్) తయారు చేయొచ్చని చెప్పారు. అలా తయారైన బయోప్లాస్టిక్ను వేడి చేసి విడిభాగాలను తయారు చేసే అచ్చుల్లో పోసి లేదా త్రీడీ ప్రింట్ తీసి కారు పార్టులను తయారు చేస్తామన్నారు. ప్రస్తుతం ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినా, ఇప్పుడున్న పద్ధతులతో పోలిస్తే పర్యావరణానికి చాలా మేలని అంటున్నారు. వీటిని కార్ల పరిశ్రమకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా వచ్చే ఏడాది చిన్న ఫ్యాక్టరీని కడతామని కోమల చెప్పారు.
తేలికైనవి.. మన్నికైనవి
యూరప్లో గత పదేళ్లలో కార్ల నుంచి విడుదలయ్యే ఉద్గారాలు 24 శాతం తగ్గుముఖం పట్టాయి. అదే టైంలో కార్ల ఉత్పత్తి 40 శాతం పెరిగింది. అంటే పర్యావరణం కోసం ఎంత మంచి చేస్తున్నా మరింత చేయాల్సి ఉందని బయోమోటివ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కోమల అంటున్నారు. అందుకే కార్లు తేలికగా (లైట్ వెయిట్) ఉండేలా చేస్తే, ఉద్గారాలు తగ్గుతాయంటున్నారు. కాస్ట్ ఐరన్కు బదులు అల్యూమినియం వాడుతున్నారిప్పుడు. దాన్ని వెలికితీయాలన్నా, లోహంగా మార్చాలన్న చాలా శక్తి కావాలి. అంటే కార్లలో ఇప్పుడు వాడుతున్న అల్యూమినియం ఇంజన్ సిలిండర్ను తయారు చేయాలంటే ఐరన్ కన్నా 1.8 నుంచి 3.7 రెట్ల శక్తి అవసరం అవుతుందంటున్నారు క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్క్ జాలీ. బయోప్లాస్టిక్, ఐరన్తో చేసే విడిభాగాలు తేలికగా ఉంటాయన్నారు. కార్లలో ఇలాంటి మార్పులు చేస్తే పర్యావరణానికి చాలా మేలవుతుందని చెబుతున్నారు. కరెంట్ కార్లు కూడా ఓ రకంగా పర్యావరణానికి హాని చేసేవేనని జాలీ అన్నారు. వాటిలో వాడే లిథియం అయాన్ బ్యాటరీలను శిలాజ ఇంధనాలతోనే తయారు చేస్తారని, దాని వల్ల మామూలు కార్ల కన్నా కూడా కరెంట్ కార్లతో 75 శాతం ఎక్కువగా వాతావరణ కాలుష్యం జరుగుతుందని చెప్పారు.
ప్లాస్టిక్ బాటిళ్లతో మ్యాట్లు
ఈ మధ్యే పర్యావరణం కోసం ఫోర్డ్ ఓ మంచి ప్రకటన చేసింది. అదే, ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసి కార్లలో వేసే మ్యాట్లను తయారు చేస్తామని, వాటినే వాడతామని ప్రకటించింది. కంపెనీ ఏటా 120 కోట్ల ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేస్తోంది. ఆ తర్వాత బీఎండబ్ల్యూ కూడా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వైపు మళ్లింది. అయితే, అది కేవలం చిన్న ఉపశమనం మాత్రమేనని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి ఇనిస్టిట్యూట్ ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రొఫెసర్ స్టీవ్ ఇవాన్స్ చెప్పారు. కంపెనీలు కార్ల తయారీ కోసం వాడే ఎనర్జీని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ఉదాహరణకు టయోట యూరప్లో 14 ఏళ్లుగా ఏటా 8 శాతం చొప్పున ఎనర్జీని తగ్గించిందన్నారు. ఇలాంటి నిర్ణయాలే దీర్ఘకాలంలో మంచి చేస్తాయన్నారు.
