హనుమాన్ జయంతి సందర్భంగా, హనుమంతుని గుణాల నుండి మన రాశి ప్రకారం నేర్చుకోదగ్గ కొన్ని విషయాలు ఏంటో తెలుసా... ఇవన్నీ కూడా మీ రాశిచక్రంపై ఆధారపడి ఉంటాయి, కాబట్టి అవేంటో చూద్దామా...
మేష రాశి
మేష రాశి వారికి కోపం, ఆవేశం కొంచెం ఎక్కువే. హనుమంతుడికి ఎంతో శక్తి ఉన్నా ఆయన ఎప్పుడూ శాంతంగా ఉండేవారు. అందుకే మీరు కూడా అతిగా ఆవేశపడకుండా, ఓపికగా ఉండటం అలవాటు చేసుకుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారు దేనినైనా ఆశించి పనులు చేస్తుంటారు. కానీ హనుమంతుడు రాముడికి నిస్వార్థంగా సేవ చేశారు. మీరు కూడా ఏ ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సాయం చేయడం నేర్చుకోవాలి. అప్పుడే మీ బంధాలు బలంగా ఉంటాయి.
మిథున రాశి
మీరు ఒకేసారి చాలా పనులపై దృష్టి పెడుతుంటారు. హనుమంతుడు తన లక్ష్యం (సీతమ్మను వెతకడం) కోసం ఎంత ఏకాగ్రతతో పనిచేశారో, మీరు కూడా మీ లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టి పనిచేయడం నేర్చుకోవాలి.
కర్కాటక రాశి
మీరు చిన్న విషయాలకే ఎమోషనల్ అయిపోతుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం హనుమంతుడిని చూసి నేర్చుకోవాలి.
సింహ రాశి
మీకు నాయకత్వ లక్షణాలు, కొంచెం గర్వం ఉండవచ్చు. హనుమంతుడు మహా బలవంతుడైనా రాముడి ముందు ఎంతో వినయంగా ఉండేవారు. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం మీ విజయానికి అసలైన సూత్రం.
కన్యా రాశి
ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించడం కన్యా రాశి వారికి అలవాటు. హనుమంతుడిలాగా దేవుడిపై లేదా ప్రకృతిపై నమ్మకం ఉంచి, కొన్ని విషయాలను వాటి మానానా వాటిని వదిలేయడం నేర్చుకోవాలి.
తులా రాశి
హనుమంతుడికి రాముడిపై ఉన్న గురి ఆయనకు ఎంతో స్పష్టతను ఇచ్చింది. మీరు కూడా ఏదో ఒక లక్ష్యంపై లేదా దైవంపై గట్టి నమ్మకం ఉంచితే, జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా సరైన దారిలో నడుస్తారు.
వృశ్చిక రాశి
మీలో చాలా శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తిని కోపం కోసం కాకుండా, మంచి పనుల కోసం ఎలా వాడుకోవాలో మీరు తెలుసుకోవాలి. హనుమంతుడిలా మీ బలాన్ని ఇతరుల మేలు కోసం వాడండి.
ధనుస్సు రాశి
హనుమంతుడు అప్పగించిన పనిని చాలా బాధ్యతగా పూర్తి చేసేవారు. మీరు కూడా జీవితంలో బాధ్యతలను ఎగ్గొట్టకుండా, వాటిని గౌరవంగా స్వీకరించి పూర్తి చేయడం నేర్చుకోవాలి.
మకర రాశి
మీరు కష్టపడే తత్వం ఉన్నవారే, కానీ గెలవడానికి అప్పుడప్పుడు అడ్డదారులు వెతుకుతుంటారు. హనుమంతుడిలా నీతిగా, నిజాయితీగా ఉంటూ కష్టపడటం నేర్చుకోండి. అప్పుడే మీకు నిజమైన విజయం దక్కుతుంది.
కుంభ రాశి
మీరు ఒక్కోసారి మానసికంగా బలహీనపడతారు. హనుమంతుడు అంటేనే ధైర్యానికి గుర్తు. కాబట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని, భయం లేకుండా ముందడుగు వేయడం నేర్చుకోవాలి.
మీన రాశి
మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. కానీ హనుమంతుడు ఎప్పుడూ వానర సైన్యంతో, తన వారితో కలిసి ఉండేవారు. మీ బంధుమిత్రులతో ప్రేమగా ఉంటూ, వారి సపోర్ట్ తీసుకోవడం నేర్చుకుంటే జీవితంలో త్వరగా విజయం సాధిస్తారు.
