సమయం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై CEC కీలక వ్యాఖ్యలు.

సమయం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై CEC కీలక వ్యాఖ్యలు.

రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ పై కేంద్ర ఎన్నికల కమిషనర్ CEC జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు కేసు వివరాలను భర్తీ చేయాలని నటరాజన్ కు సమయం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని అన్నారు.

ఫామ్స్ నింపే నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందేనని ఈ సందర్భంగా అన్నారు. నామినేషన్ పత్రంలో ప్రతీ కాలం భర్తీ చేయాలని ఎన్నికల నిబంధన ఉందని చెప్పారు. కొన్ని సార్లు ఎన్నికల అధికారులు చూసి చూడనట్లు ఉన్నా - రాజకీయ ప్రత్యర్థులు దాన్నే ఎత్తిచూపుతారని అన్నారు. నామినేషన్ పై ప్రత్యర్ధులు ఫిర్యాదు చెయ్యకపోతే పరిస్థితి మరోలా ఉండేదేమో అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also Read ; బ్రిటన్కు కొత్త ప్రధాని బర్న్హామ్..! 

నామినేషన్ అంశంపై ఒకసారి రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకున్న తర్వాత తన పరిధిలో ఉండదని ఈ సందర్భంగా చెప్పారు. మీనాక్షి నటరాజన్ సుప్రీం కోర్టుకు వెళ్లినా.. కోర్టు సైతం RO నిర్ణయాన్నే సమర్థించిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు ఉంటే..  SIR ప్రక్రియ తో ఇక ఉండవని చెప్పారు.