బై ఎలక్షన్ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి.. విజయోత్సవ ర్యాలీలకు నో పర్మిషన్

బై ఎలక్షన్ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి.. విజయోత్సవ ర్యాలీలకు నో పర్మిషన్

హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయని చీఫ్ ఎలాక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ అన్నారు. రేపు కరీంనగర్ SRR డిగ్రీ కాలేజ్ లో కౌంటింగ్ జరుగుతుందన్నారు. 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుందన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల కోసం PPE కిట్స్ ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ దగ్గర జనాలు గుంపులుగా ఉండకూడదని హెచ్చరించారు. విజయోత్సవ ర్యాలీలకు పర్మిషన్ లేదన్నారు. పోలింగ్ రోజు బయటకి వచ్చిన  VV ప్యాట్.. డిఫెక్టివ్ VV ప్యాట్ అని తెలిపారు. అది పోలింగ్ కు సంబంధించిన VV ప్యాట్ కాదన్నారు.