కీసర, వెలుగు: కీసర మండల పరిధిలోని చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో 18వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల15 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఫౌండర్, చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ గౌడ్ తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 14న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుండగా, మంత్రులు, ఎమ్మెల్యేలు, భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
భక్తుల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు సికింద్రాబాద్ నుంచి చీర్యాల్ టెంపుల్ కు ప్రత్యేక బస్సు సౌకర్యం (బస్సు నం. 241C) కల్పించడంతో పాటు, చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు పూటలా నిత్య అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, చలువ పందిళ్లు, మెడికల్ క్యాంపులు, ఉచిత మజ్జిగ పంపిణీకి ఏర్పాట్లు చేశారు. వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీని అంచనా వేసి ట్రాఫిక్ సీఐ శివశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో పకడ్బందీగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.
