ఇక నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తున్నప్పుడు మధ్యలో పాజ్ చేయడానికి స్క్రీన్‌పై వేలితో నొక్కి పట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క ట్యాప్‌తో వీడియోను పాజ్ చేసేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది ఇన్‌స్టాగ్రామ్. రీల్‌పై ఎక్కడైనా ఒక్కసారి ట్యాప్ చేస్తే చాలు, వీడియో అక్కడికక్కడే ఆగిపోతుంది. మళ్లీ ట్యాప్ చేస్తే వీడియో ప్లే అవుతుంది.
వీడియో పాజ్ అయినప్పుడు స్క్రీన్‌పై ‘మ్యూట్’ ఐకాన్ కనిపిస్తుంది. దీని ద్వారా వీడియోను ఆపాలా లేక కేవలం ఆడియోను మ్యూట్ చేయాలా అనేది ఈజీగా డిసైడ్ అవ్వొచ్చు. కుకింగ్ ట్యుటోరియల్స్, డిఐవై వీడియోలు చూసేటప్పుడు లేదా వీడియోలోని టెక్స్ట్‌ను చదవాలనుకునే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. యాప్‌ను ఒకసారి ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో అప్‌డేట్ చేసుకున్నా మీకు కూడా ఈ ఫీచర్ కనిపిస్తుంది.
