నాగరాజ్, సంగీతలది తమిళనాడులోని విల్లుపురం. ఇద్దరూ మిడిల్ క్లాస్ కుటుంబాల నుంచి వచ్చినవాళ్లే. నాగరాజ్‌కు సంగీత అంటే ఇష్టం. దాంతో ఒకరోజు తన ప్రేమ విషయం సంగీతకు చెప్పేశాడు. ఆ వెంటనే సంగీత వాళ్ల అమ్మకు కూడా చెప్పాడు. అతని సిన్సియారిటీ చూసి సంగీత లవ్‌లో పడింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకున్నారు. పెండ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు పెరిగాయి. పిల్లలు పింకీ, సంజీవ్ పుట్టాక ఖర్చులు పెరిగాయి.
బిజినెస్‌లో లాస్
యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు నాగరాజ్ ఎన్నో బిజినెస్‌లు ప్రయత్నించాడు. ప్రతీది ఫెయిల్ అయింది. బిజినెస్‌ల కోసం దాదాపు 10 లక్షల రూపాయలు అప్పు చేశాడు. ఒకవైపు అప్పులు, మరోవైపు ఫ్యామిలీ ఖర్చులు, భవిష్యత్తు మీద భయం.. వల్ల రోజురోజుకూ ఒత్తిడి పెరిగింది. అదే టైంలో బిజినెస్‌లు పూర్తిగా మూతపడ్డాయి. అప్పుడు భార్య సంగీత, అతని తల్లిదండ్రులే అండగా నిలిచారు. అందుకే ఎప్పుడూ “మా అమ్మా-నాన్న, సంగీత ఇచ్చిన సపోర్ట్, లవ్ మాత్రమే నన్ను మళ్లీ నిలబెట్టాయి” అని చెప్తుంటాడు నాగరాజ్.
యూట్యూబ్‌లోకి..
వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడే యూట్యూబ్‌లో వీడియోలు చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే 2013 నవంబర్ 22న “విత్ లవ్ నాగరాజ్ సంగీత” పేరుతో చానెల్ స్టార్ట్ చేశారు. మొదట్లో కేవలం హాబీగా, తమ రోజువారీ లైఫ్‌ను షేర్ చేయడానికి మాత్రమే వీడియోలు చేసేవాళ్లు. సరదాగా కపుల్ చాలెంజెస్, ప్రాంక్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ అప్‌లోడ్ చేశారు. అలాంటి వీడియోలే అందరూ చేస్తుండడంతో పెద్దగా వ్యూస్ రాలేదు. కానీ.. వీళ్ల మాటలు, లవ్ స్టోరీ నచ్చి కొన్నాళ్లకు వ్యూస్ పెరిగాయి.
టర్నింగ్ పాయింట్
2020 లాక్డౌన్లో చానెల్ గ్రోత్ వేగంగా పెరిగింది. ఇంట్లోనే ఉండి ఫ్యామిలీ బాండింగ్ వీడియోలు, ఎమోషనల్ కంటెంట్, కామెడీ వీడియోలు చేస్తూ యూత్‌కి కనెక్ట్ అయ్యారు. సబ్‌స్క్రయిబర్ల సంఖ్య లక్షల నుంచి మిలియన్లకు చేరుకుంది. 4 మిలియన్ల సబ్‌స్క్రయిబర్ల మార్క్‌ని చేరుకున్నప్పుడు “సక్సెస్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈజీ” టైటిల్‌తో ఒక వీడియో చేశాడు. ఆ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత నెగెటివ్ కామెంట్స్, క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ, నిజమైన అభిమానులు మాత్రం వాళ్లకు ఎప్పుడూ అండగానే ఉన్నారు. దాంతో 2025 నాటికి 10 మిలియన్ సబ్‌స్క్రయిబర్ల మార్క్‌ని దాటగలిగారు. అందుకే ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పేందుకు ప్రత్యేకంగా ఒక వీడియో చేశారు. ఇప్పుడు వాళ్ల కుటుంబం చాలా హ్యాపీగా ఉంది. కొడైకెనాల్, గోవా లాంటి ప్లేస్‌లకు ట్రిప్స్‌కు వెళ్తూ అక్కడ తీసిన వ్లాగ్స్‌ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. చానెల్‌ను ఇప్పటివరకు 11.3 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. వాళ్లు పెట్టిన దాదాపు ప్రతి వీడియోకు మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. ఒక షార్ట్ వీడియోకైతే ఏకంగా 116 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక 50 మిలియన్ల వ్యూస్ దాటిన వీడియోలు చాలానే ఉన్నాయి. చానెల్‌లో ప్రస్తుతం 1590 వీడియోలు ఉన్నాయి.
