టాస్ గెలిచిన ఢిల్లీ.. CSK ఫస్ట్ బ్యాటింగ్.. మూడుకు మూడూ ఓడింది.. ఈ మ్యాచ్ అయినా..

టాస్ గెలిచిన ఢిల్లీ.. CSK ఫస్ట్ బ్యాటింగ్.. మూడుకు మూడూ ఓడింది.. ఈ మ్యాచ్ అయినా..

చెన్నై: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఐపీఎల్ సీజన్లో వరుస ఓటములతో చెన్నై డీలా పడటంతో కమ్ బ్యాక్ ఇస్తారని ఆ జట్టు అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పేలవంగా సీజన్ను మొదలుపెట్టింది. ఆ సంవత్సరం.. డిఫెండింగ్ ఛాంపియన్లుగా టోర్నమెంట్‌లోకి అడుగుపెట్టిన CSK వరుసగా నాలుగు ఓటములతో సీజన్‌ను ఆరంభించారు. అందుకు ఏమాత్రం తగ్గకుండా 2026 ఐపీఎల్ సీజన్ను కూడా చెన్నై జట్టు పేలవంగా మొదలుపెట్టింది. మూడు మ్యాచులకు మూడూ ఓడి చెన్నై అభిమానుల మూడ్ పాడు చేసింది.

ఈ సీజన్‌లో CSK ప్రదర్శన దారుణంగా ఉంది. బౌలింగ్ విభాగం పేలవంగా ఉంది, నూర్ అహ్మద్ కూడా 2025లో అదరగొట్టినప్పటికీ ఈ సీజన్లో చేతులెత్తేశాడు. సంజూ శాంసన్ ఇంకా నిలదొక్కుకోనే లేదు. రుతురాజ్ గైక్వాడ్ కూడా రాణించడం లేదు. కోట్లకు కోట్లు పోసి కొన్న కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ ఇంకా తమ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించనే లేదు. 

Also Read : పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన హైదరాబాద్ 

RCB చేతిలో ఘోర ఓటమి తర్వాత.. CSKకు ఓటములను సమీక్షించుకోవడానికి సమయం దొరికింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బలంగా ఉండటం CSK జట్టుకు సవాల్ విసురుతున్న పరిణామం. ఈ మ్యాచ్లో అయినా CSK గెలుపు బాట పడుతుందో లేక వరుస ఓటములను కొనసాగిస్తుందో చూడాలి.

చెన్నై సూపర్ కింగ్స్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, బ్రెవిస్, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జప్‌నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్

ఢిల్లీ క్యాపిటల్స్: పాతూం నిస్సాంక, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అక్సర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, స్టబ్స్, అక్వీబ్ నబీ దార్, లుంగీ ఎంగ్డీ, కుల్దీప్ యాదవ్, నటరాజన్, ముకేష్ కుమార్