తిరుపతి: మ్యాగీ నూడిల్స్ కోసం అర్ధరాత్రి ఓ రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. ఆర్డర్ లేట్ అయ్యిందని కేఫ్ యాజమానితో పాటు అతని కుమారుడిపై దాడి చేశాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలోని శ్రీనివాసమంగాపురంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. శనివారం అర్ధరాత్రి శ్రీనివాసమంగాపురంలోని శ్రీవారి కేఫ్‌కు రౌడీ షీటర్ బాలాజీ అలియాస్ డ్యూక్ బాలు వెళ్లాడు. మ్యాగీ న్యూడిల్స్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ కాస్త ఆలస్యం కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలు కేఫ్ యాజమానితో గొడవ పడ్డాడు.
వాగ్వాదం మరింత ముదరడంతో కోపోద్రిక్తుడైన బాలు కేఫ్ యాజమానితో పాటు అతని కుమారుడిపై గాజు సీసాలతో దాడి చేశారు. రౌడీ షీటర్, అతని అనుచరులు కేఫ్లోనికంప్యూటర్లు, కుర్చీలు, అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో బాలు కూడా గాయపడ్డాడు. కేఫ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గొడవకు గల కారణాలపై ఆరా తీశారు.
