మహిళ సంక్షేమానికి పెద్దపీట: మేయర్

మహిళ సంక్షేమానికి పెద్దపీట: మేయర్

జూబ్లీహిల్స్, వెలుగు: మహిళా సంక్షేమానికి కాంగ్రెస్​ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నగర మేయర్​ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్ లో రూ.29 లక్షలతో నిర్మించిన మహిళా భవన్ మొదటి అంతస్తును స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆమె ప్రారంభించారు.

అలాగే శ్రీరామ్ నగర్‌‌‌‌‌‌‌‌లో రూ.2 కోట్ల నిధులతో నిర్మిస్తున్న స్టిల్ట్‌‌‌‌‌‌‌‌, మూడు అంతస్తుల మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్‌‌‌‌‌‌‌‌లోని మొదటి అంతస్తును కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శంకర్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌ఈ విజయ్‌‌‌‌‌‌‌‌, ఇతర అధికారులు, బస్తీ వాసులు పాల్గొన్నారు.