కొత్త ఓటర్లకు మస్తు క్లారిటీ

కొత్త ఓటర్లకు మస్తు క్లారిటీ
  • ఈసారి 13 కోట్ల మంది నయా ఓటర్లు

మాయమాటలకు ఈజీగా పడిపోమంటున్నరు. పాలిటిక్స్ పై చాలా క్లారిటీ పెంచుకున్నరు. పొలిటీషియన్స్ ని అణువణువూ చదివేస్తున్నారు. ఎవరికి, ఎందుకు ఓటేయాలో ఇప్పటికే డిసైడ్ అయ్యారు. అవును. ఈ దఫా సాధారణ ఎన్నికలు ఇండియాకి చాలా స్పెషల్ . ఎందుకంటే దేశం ఫేట్ ను డిసైడ్ చేయబోయేది ఫస్ట్ టైమ్ ఓటర్లే మరి. 2019 లోక్సభ ఎలన్నికల్లో ఓటేయబోతున్న 90 కోట్ల మందిలో కొత్త ఓటర్ల సంఖ్య 13 కోట్లు. అంటే, జనాభాలో 10 శాతం అన్నమాట. కుల, మత, ప్రాంతీయ సమీకరణలకు దీటుగా ప్రభావంచూపనున్న ఈ ‘నయా’ సెక్షన్ ఎవరివైపు మొగ్గు చూపితే వాళ్లదే ఢిల్లీ పీఠం డిసైండింగ్ ఫ్యాక్టర్స్ గా ఫస్ట్ టైమ్ ఓటర్ల మాండ్స్ ఏమిటో సర్వేలో తెలిసింది. అభిప్రాయం చెప్పిన వారిలో 72 శాతం మందికి ఉద్యోగమే మొదటి ప్రాధాన్యం. క్వాలిటీ ఎడ్యుకేషన్, విమెన్ సెఫ్టీ, కరప్షన్ ఫ్రీ కంట్రీ తదితర అంశాలు తర్వాత ప్రియార్టీలు. ప్రఖ్యాత రీసెర్చ్, డేటా అనలిటిక్స్ సంస్థ యువర్ గవర్నమెంట్ (యూ గవ్), ఫస్ట్ పోస్ట్ అనే న్యూవెబ్ సైట్ లో కలిసి నిర్వహించిన సర్వేలో ఇలాంటి ఆసక్తికర విషయాలెన్నో తెలిశాయి. ‘మూడ్ ఆఫ్ ఫస్ట్ టైమ్ ఓటర్’ పేరుతో విడుదలైన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా మొత్తం 40వేల శాంపిల్స్ సేకరించారు. 18 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్నవాళ్ల ను మాత్రమే అభిప్రాయాలు అడిగారు. 2019 జనవరి 3 నుంచి 9 వరకు ఆన్ లైన్లో ప్రశ్నోత్తరాలు సాగాయి. ఒపీనియన్స్ తెలిపిన యువతరం నివసించే ప్రదేశాన్ని బట్టి వాళ్లను మూడు కేటగిరీలుగా విభజించారు. అవి టైర్ 1 సిటీలు (లక్ష మంది కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు), టైర్ 2 సిటీ (50 వేలు– లక్షలోపు జనాభా ), టైర్ 3 సిటీ (జనాభా 20 వేల నుంచి 50 వేల లోపు ఉన్న పట్టణాలు). ఇక యువతరం చెప్పిన సమాధానాలను బట్టి సర్వే ఫలితాలను కూడా నాలుగు సెక్షన్లుగా నిర్వాహకులు విడుదల చేశారు. అవి 1. రాజకీయాలు, సిద్ధాంతాలు, 2. ఉద్యోగాలు,ఆర్థిక వ్యవస్థ, 3.కులం, మతం, 4. వార్తలు, సమాచారం. పెద్ద నగరాతో పోల్చుకుంటే తక్కువ జనాభా ఉన్న టైర్ 3 సిటీల్లోని యువతే రాజకీయాల పట్ల అమితా సక్తిని చూపించడం విశేషం. అయితే పెద్ద నగరాల్లోని వాళలో చాలా మంది రాజకీయాలను కొత్త కోణంలో చూస్తుంటే, చిన్న పట్టణాల్లోని యూత్లో ఎక్కువ శాతం మంది పాత మైండ్ సెట్ తోనే  ఆలోచిస్తున్నారని సర్వే చెబుతోంది. లిబరల్ ఆలోచనలున్నవాళ్లు టైర్ 1 సిటీల్లో 23 శాతం మందైతే, టైర్ 2 సిటీల్లో 22 శాతం. టైర్ 3ల్లోపాలిటిక్స్ ను ఓపెన్ మైండ్ తో చూసేవాళ్లు 14 శాతం మంది మాత్రమే. మిగతా డిమాండ్ల ప్రియారిటీల్లో తేడాలున్నాఉద్యోగాలు కావాలనే ఆకాంక్ష మూడు ప్రాంతాల్లోనూ బలంగా వ్యక్తమైంది. టైర్ 1 సిటీల్లో 71 శాతం మంది ఉద్యోగావకాశానికి మొదటి ప్రాధాన్యమిచ్చారు. ఇది టైర్ 2లో 71 శాతంగా(సెకండ్ ప్రియారిటీ), టైర్ 3ల్లో 61 శాతం(సెకండ్ ప్రియారిటీ)గా ఉంది. టైర్ 2 సిటీల్లో మహిళల రక్షణే ఫస్ట్ ప్రియారిటీ అని 71 శాతం మంది చెప్పారు.