తెలంగాణలో కోటి ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది: సీఎం రేవంత్ 

తెలంగాణలో కోటి ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది: సీఎం రేవంత్ 

తెలంగాణలో కోటి ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం ( సెప్టెంబర్ 7 ) రవీంద్ర భారతిలో కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభకు ముఖ్య అతిధిగా హాజరైన సీఎం రేవంత్ సభలో మాట్లాడుతూ.. SIR ను ఉద్దేశించి ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. SIR పేరుతో వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని.. తెలంగాణలో కోటి ఓట్లను తీసేసే కుట్ర జరుగుతోందని అన్నారు సీఎం రేవంత్.

పేదవారు, కూలీలు,కార్మికులు పట్టణాలకు వలస వచ్చారని.. గ్రామాల్లో ఉన్నవారి పేర్లను తీసేస్తున్నారని అన్నారు సీఎం రేవంత్. తన నియోజకవర్గంలోనే 80 వేల ఓట్లను తీసేసే కుట్ర జరుగుతొందని అన్నారు సీఎం రేవంత్. బీహార్ తెలంగాణ విధానాన్ని ఉపయోగిస్తామని బీజేపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని అన్నారు.

ఒకప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీ అక్రమ కేసులు పెట్టేదని.. చట్టాలను ఉపయోగించుకొని ఎన్నికల్లో గెలిచేదని.. మోడీ వచ్చాక రూటు మార్చారని.. ఒక క్రమపద్ధతిలో ఓట్లు తొలగిస్తున్నారని అన్నారు సీఎం రేవంత్. 

చనిపోయినవారి ఓట్లే కాకుండా ఇక్కడే పుట్టి, ఇక్కడే ఉన్నవారి ఓట్లను కూడా తీసేస్తున్నారని అన్నారు సీఎం రేవంత్. SIR ప్రక్రియ కన్నా ముందే ఓట్లు తొలగించే కార్యాచరణ తీసుకున్నారని అన్నారు సీఎం రేవంత్.