ఆస్పత్రిపాలైన మాజీ మంత్రి డీకే శివకుమార్

ఆస్పత్రిపాలైన మాజీ మంత్రి డీకే శివకుమార్

కర్నాటక  సీనియర్  కాంగ్రెస్  నేత,  మాజీ మంత్రి  డీకే  శివకుమార్  మళ్లీ  ఆస్పత్రిలో  చేరారు.  ఛాతీలో  నొప్పిగా  ఉండడంతో  నిన్న రాత్రి  ఆయన్ను ఆస్పత్రికి  తీసుకెళ్లారు.  ఈ నెల 1న బీపీ, షుగర్ లెవల్స్ నిలకడగా లేకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న డీకే తీహార్ జైలుకు వెళ్లి వచ్చారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన… తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో తరచు అస్వస్థతకు గురవుతున్నట్లు సమాచారం.