ఇంటికో ఉద్యోగం ఇస్తం : కాంగ్రెస్

ఇంటికో ఉద్యోగం ఇస్తం : కాంగ్రెస్

ఇంటికో ఉద్యోగం ఇస్తం
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ

షిల్లాంగ్: ప్రతి ఇంటికో ఉద్యోగం, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఒంటరి తల్లులకు ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్​ ఇస్తామని కాంగ్రెస్ మేఘాలయ రాష్ట్ర చీఫ్​ ప్రకటించారు. ఈ నెల 27న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను గురువారం రిలీజ్ చేసింది. ప్రధానంగా ఐదు అంశాలపై వాగ్దానాలతో ‘5స్టార్’ మేనిఫెస్టోను రూపొందించినట్లు కాంగ్రెస్ పేర్కొంది. రాష్ట్రంలో వేళ్లూనుకున్న అవినీతి, కరెంటు కోతలు, డ్రగ్స్ అనే మూడు సమస్యల నుంచి ప్రజలకు విమక్తి కల్పిస్తామని ప్రతిజ్ఞ చేసింది. షిల్లాంగ్​లోని కాంగ్రెస్ ​పార్టీ ఆఫీసులో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, మేఘాలయ కాంగ్రెస్ ఇన్​చార్జ్​మనీశ్​చత్రథ్ తో కలిసి ఆ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ ​విన్సెంట్​హెచ్ పాల్​ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విన్సెంట్ మాట్లాడుతూ.. మేఘాలయలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఒంటరి తల్లులకు ప్రతి నెల రూ.3వేల పెన్షన్​ ఇస్తామన్నారు. ఈ ఆర్థిక సాయం వారి కుటుంబాల జీవనానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.