రాహుల్​ను ఒప్పిస్తాం

రాహుల్​ను ఒప్పిస్తాం
  • అక్టోబర్​ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక
  • 19 న ఫలితాలు

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మూడేండ్లుగా సాగుతున్న సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఆదివారం కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో సీడబ్ల్యూసీ భేటీ అయింది. విదేశీ పర్యటనలో ఉన్న ఆమె వర్చువల్ మోడ్ లో  సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో నూతన అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి షెడ్యూల్  ఖరారు చేశారు.

సీడబ్ల్యూసీ భేటీ అనంతరం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 24 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన, 8 న నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఉంటుందన్నారు. అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయని, 19న ఉదయం  ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 

రాహుల్ ప్రెసిడెంట్ అవుతారు. 

హరీశ్ రావత్ అక్టోబర్ 17 న జరిగే ఎన్నికలో రాహుల్ గాంధీ పార్టీ ప్రెసిడెంట్ అవుతారని ఆ పార్టీ నేత హరీశ్ రావత్ అన్నారు. రాహుల్ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారని తాను నమ్మకంగా ఉన్నానని చెప్పారు. ఆ దిశలో రాహుల్​ను ఒప్పిస్తామని తెలిపారు.