ఎన్నాళ్లు కాదు.. ఎట్ల బతికామన్నదే ముఖ్యం

ఎన్నాళ్లు కాదు.. ఎట్ల బతికామన్నదే ముఖ్యం

హైదరాబాద్‌‌‌‌, వెలుగుదేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం భద్రతను కల్పిస్తోందని గవర్నర్‌‌‌‌తమిళిసై సౌందరరాజన్‌‌‌‌అన్నారు.  ఏ విధాన నిర్ణయమైనా సామాన్యులకు చేరితేనే రాజ్యాంగ రూపకల్పనకు నిజమైన ప్రయోజనం చేకూరుతుందని మహాత్మాగాంధీ పేర్కొన్నారని గుర్తు చేశారు. రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని సూచించారు. ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. ఎట్ల బతికామన్నదే ముఖ్యమని తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం రాజ్‌‌‌‌భవన్‌‌‌‌లో ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌‌‌‌తో పాటు సీఎం కేసీఆర్‌‌‌‌, హైకోర్టు చీఫ్‌‌‌‌జస్టిస్‌‌‌‌ రాఘవేంద్రసింగ్‌‌‌‌చౌహాన్‌‌‌‌, స్పీకర్‌‌‌‌పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, మండలి చైర్మన్‌‌‌‌గుత్తా సుఖేందర్‌‌‌‌రెడ్డి, హైకోర్టు జడ్జిలు, మంత్రులు డాక్టర్‌‌‌‌బీఆర్‌‌‌‌అంబేద్కర్‌‌‌‌చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో గవర్నర్‌‌‌‌మాట్లాడుతూ, అంబేద్కర్‌‌‌‌125వ జయంతి ఉత్సవాల సందర్భంగా నవంబర్‌‌‌‌26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాలని 2015లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. రాజ్యాంగం కల్పిస్తున్న రక్షణ దేశంలోని యువతకు చాలావరకు తెలియదని, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

లక్ష్యాలను సాకారం చేద్దాం: సీజే

హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌‌‌‌చౌహాన్‌‌‌‌మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందు పరిచిన లక్ష్యాలను సాకారం చేయాలన్నారు. రాజ్యాంగం అమలులో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి సామాన్య ప్రజలకు న్యాయం చేకూర్చే బాధ్యత అందరిపై ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌‌‌‌రావు, మహమూద్‌‌‌‌అలీ, ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు, ఇంద్రకరణ్‌‌‌‌రెడ్డి, జగదీశ్​రెడ్డి, తలసాని శ్రీనివాస్‌‌‌‌యాదవ్‌‌‌‌, ప్రశాంత్‌‌‌‌రెడ్డి, పువ్వాడ అజయ్‌‌‌‌, గంగుల కమలాకర్‌‌‌‌, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్‌‌‌‌, సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌‌‌‌, సీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌కే జోషి, డీజీపీ మహేందర్‌‌‌‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.