ఎన్నికల సిబ్బందికి ఇచ్చిన ఈసీ ఫుడ్ మెనూ ఇదే

ఎన్నికల సిబ్బందికి ఇచ్చిన ఈసీ ఫుడ్ మెనూ ఇదే

న్యూఢిల్లీ: ఎన్నికల సిబ్బందికి ఈసీ ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేసింది. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆరోగ్యకరమైన ఆహారం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మెనూను రిలీజ్ చేసింది. దీని ప్రకారం సిబ్బందికి సోమవారం ఉదయం 6 గంటలకు చాయ్, రెండు అరటిపండ్లు ఇస్తారు. ఉదయం 8 నుంచి 9గంటల మధ్య బ్రేక్ ఫాస్ట్ లో ఉప్మా పెడతారు. 11 నుంచి 12 గంటల మధ్య బటర్ మిల్క్ అందజేస్తారు.

ఇక లంచ్ టైమ్ లో మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నం, చపాతీ, కోడిగుడ్డు కూర, ఏదైనా వెజిటేబుల్ కర్రీ, చట్నీ, సంబార్, పెరుగుతో భోజనం పెడతారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు నిమ్మరసం లేదా బటర్ మిల్క్ ఇస్తారు. సాయంత్రం 5:30 గంటల టైమ్ లో చాయ్, బిస్కెట్స్ అందజేస్తారు. సిబ్బంది కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, అవసరమైతే కూలర్లు కూడా పెట్టాలని ఈసీ ఆదేశించింది. మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఆఫీసర్లు, గ్రామాల్లో పంచాయతీ అధికారులు ఈ ఏర్పాట్లన్నీ చేయాలని సూచించింది.