
ఓటరు జాబితాలో పేరు ఉండి, ఓటరు కార్డు లేనివారు ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులు చూపించి ఓటు వేయొచ్చు. ఓటరు గుర్తింపు నిర్ధారణ సమయంలో క్లరికల్, స్పెల్లింగ్ తప్పుల వంటి వాటిని పోలింగ్ అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. మరొక అసెంబ్లీ నియోజకవర్గ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ జారీ చేసిన ఎపిక్ కార్డును ఓటరు చూపితే, ఆ ఓటరు పేరు పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన ఓటర్ల జాబితాలో ఉన్నట్లయితే, దాన్ని గుర్తింపు కోసం అనుమతించవచ్చని తెలిపింది.
ఫొటో ఉన్న ఓటరు స్లిప్పు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగ సంస్థల గుర్తింపు కార్డులు, బ్యాంకులు, పోస్టాఫీసు జారీ చేసిన పాసుపుస్తకం (ఫొటోతో ఉన్నవి), పాన్‌కార్డు, జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్‌కార్డు, ఉపాధి హామీ జాబ్‌కార్డు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డు, ఫొటోతో జత చేసిన పింఛను పేపర్లు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు పేపర్లు... వీటిల్లో ఏదైనా గుర్తింపు కార్డుగా చూపించొచ్చు.