హైదరాబాద్: హనుమకొండ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 2 వేల నాటుకోళ్లను వదిలేశారు. దీంతో కోళ్ల కోసం పొలాలు, పత్తి చేన్ల వెంట జనం పరుగులు తీశారు. కొందరు ఒకటి రెండు కోళ్లను చేతుల్లో పట్టుకొని వెళ్లగా.. మరికొందరు దొరికినకాడికి దొరికినట్లు పదుల కొద్ది కోళ్లను సంచులో వేసుకొని మరీ పరుగులు పెట్టారు. దీంతో అనేక కుటుంబాలకు మంచి చికెన్ విందు భోజనం దొరికినట్లైంది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు పశుసంవర్ధక శాఖ అధికారులు, స్థానిక పోలీసులు ఈ సంఘటనపై సమాచారం సేకరిస్తున్నారు. కోళ్లను వదిలేసిన వారు ఎవరో, కారణం ఏమిటో తెలుసుకునేం దుకు దర్యాప్తు చేపట్టారు.
2వేల కోళ్లను రోడ్డు పై పడేశారు pic.twitter.com/PUF8farE2F
— దివిటి ఛానల్ (@risingsun143) November 8, 2025
