Anasuya vs Sivaji: 'తగ్గేదే లే'.. శారీ టూ స్విమ్ సూట్.. నెట్టింట వైరల్ అవుతున్న అనసూయ లేటెస్ట్ వీడియోలు!

Anasuya vs Sivaji: 'తగ్గేదే లే'.. శారీ టూ స్విమ్ సూట్..  నెట్టింట వైరల్ అవుతున్న అనసూయ లేటెస్ట్ వీడియోలు!

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యల దుమారం ఏ మాత్రం తగ్గడం లేదు.  టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో రగడ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ వివాదంలో నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ గట్టిగా గొంతు వినిపిస్తుండటంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ప్రతివిమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. లేటెస్ట్ గా అనసూయ పోస్ట్ చేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి.

శివాజీపై అనసూయ ఫైర్!

హీరోయిన్లు పద్ధతిగా ఉండాలని, లేకపోతే అసభ్య పదజాలంతో పిలుస్తారని శివాజీ చేసిన వ్యాఖ్యలను అనసూయ తప్పుబట్టారు. మహిళల దుస్తుల గురించి మాట్లాడే శివాజీ .. వంకర చూపులు చూసే మగాళ్ల గురించి ఎందుకు మాట్లాడరు?" అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా, శివాజీ క్షమాపణలు చెబుతూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని, తనకు ఎవరి సానుభూతి అవసరం లేదని ఆమె ఘాటుగా స్పందించారు.

శారీ లుక్ టూ స్విమ్ సూట్..

ఈ వివాదం నడుస్తుండగానే అనసూయ షేర్ చేసిన పోస్ట్‌లు హాట్ టాపిక్ మారింది. నెటిజన్లను కొందరు శివాజీకి సపోర్టు చేస్తుండగా.. మరి కొందరు అనసూయకు సపోర్ట్ చేస్తూ పెద్ద సోషల్ మీడియా వారే నడుస్తోంది.  అనసూయ మొదట ఒక బ్లూ కలర్ శారీలో నిండుగా, సంప్రదాయబద్ధంగా ఉన్న ఫోటోలను షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. శివాజీ ఎఫెక్ట్ కు అనసూయ పద్ధతిగా మారిపోయారు అంటూ సెటైర్లు వేశారు.

 

తన శారీ లుక్‌ను శివాజీ వ్యాఖ్యలకు ముడిపెట్టడం చూసిన అనసూయ.. వెంటనే ఊహించని షాక్ ఇచ్చారు. తన పాత ట్రావెల్ డైరీస్ నుండి స్విమ్ సూట్ (Swimsuit) లో ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. "నీళ్లలో ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను.. త్వరలోనే మరో హాలిడే ప్లాన్ చేయాలి" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ట్రోలర్లకు బదులివ్వడానికే ఆమె కావాలనే ఈ బోల్డ్ వీడియోను షేర్ చేసిందని, తన వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో ఎవరి మాటా విననని ఆమె పరోక్షంగా చెప్పకనే చెప్పారని నెటిజన్లు భావిస్తున్నారు.

►ALSO READ | Google Search Trends 2025: గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ టాలీవుడ్ భామలు.. తమన్నా, రష్మిక, సమంత ఏ స్థానంలో ఉన్నారంటే?

 

 అనసూయ తన వస్త్రధారణపై వస్తున్న విమర్శలకు గతంలోనే క్లారిటీ ఇచ్చారు. నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పే హక్కు ఇతరులకు లేదు స్పష్టం చేశారు.  అయితే శివాజీ వ్యాఖ్యలు ఇప్పుడు కేవలం ఒక సినిమా ఈవెంట్ వివాదంగా మిగిలిపోలేదు. ఇది స్త్రీల వ్యక్తిగత స్వేచ్ఛ వర్సెస్ సంప్రదాయం అనే చర్చకు దారితీసింది. అనసూయ తన బోల్డ్ వీడియోతో ట్రోలర్ల నోళ్లు మూయించాలని చూస్తుంటే.. "శివాజీ హీరోయిన్ల గురించి మాట్లాడారు, మీ గురించి కాదు" అంటూ నెటిజన్లు పంచ్‌లు వేస్తున్నారు. ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి!