Google Search Trends 2025: గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ టాలీవుడ్ భామలు.. తమన్నా, రష్మిక, సమంత ఏ స్థానంలో ఉన్నారంటే?

Google Search Trends 2025: గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ టాలీవుడ్ భామలు.. తమన్నా, రష్మిక, సమంత ఏ స్థానంలో ఉన్నారంటే?

టాలీవుడ్ వెండితెరపై మెరిసే అందాల తారల క్రేజ్ కేవలం థియేటర్లకే పరిమితం కాదు.. ఇంటర్నెట్ ప్రపంచంలోనూ వారి హవా కొనసాగుతూనే ఉంటుంది. 2025 వ సంవత్సరానికి సంబంధించి గూగుల్ విడుదల చేసిన సెర్చ్ డేటా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది గూగుల్‌లో నెటిజన్లు అత్యధికంగా వెతికిన టాలీవుడ్ హీరోయిన్ల జాబితాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

తమన్నా నంబర్ వన్.. కారణం అదేనా?

చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తమన్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వయసు పెరుగుతున్నా తగ్గని గ్లామర్ షోతో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు తన హవాను కొనసాగిస్తోంది.  2025లో విడుదలైన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. దీనికి తోడు ఆమె నటించిన ఓదెలు 2, వెబ్ సిరీస్‌లు, ఇతర భారీ ప్రాజెక్టులు ఆమెను గ్లోబల్ సెర్చ్ ట్రెండ్స్‌లో టాప్‌లో నిలబెట్టాయి.

టాప్ 5లో నిలిచిన ముద్దుగుమ్మలు

గ్లోబల్ ఇంట్రెస్ట్ పరంగా తమన్నా భాటియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. హిందీలో 'సికందర్ కా ముఖద్దర్' వంటి భారీ ప్రాజెక్టులు ఆమెను వార్తల్లో నిలిపాయి.తన స్టైలిష్ లుక్స్ , గ్లామర్ ఫోటోషూట్‌లతో పాటు, ఆమె వ్యక్తిగత జీవితంపై నెటిజన్లు చూపిన ఆసక్తి ఆమెను గూగుల్ సెర్చ్‌లో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది.  

 ఆ తర్వాత స్థానంలో 'నేషనల్ క్రష్' రష్మిక రెండో స్థానంలో నిలిచింది.'పుష్ప 2'లో శ్రీవల్లిగా ఆమె నటన, ప్రమోషన్స్ , పాన్ ఇండియా ఇమేజ్ ఆమెను నిరంతరం వార్తల్లో ఉంచాయి. బాలీవుడ్ కూడా తన సత్తా చాటింది. చావా, సికందర్, కుబేరా, ది గర్ల ఫ్రెండ్, థమా వంటి చిత్రాలతో ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండతో ప్రేమాయణం, వెడ్డింగ్ వంటి అంశాలపై కూడా అభిమానులు ఆసక్తి చూపడంతో రెండవస్థానంలో నిలిచింది.

►ALSO READ | South Indian Box Office 2025 : బాక్సాఫీస్ రిపోర్ట్ 2025 : వెండితెరపై సౌత్ ఇండియన్ సినిమాల వసూళ్ల గర్జన!

ఇక మూడవ స్థానంలో సమంత రూత్ ప్రభు నిలిచింది. సినిమాల్లో కాస్త విరామం తీసుకున్నప్పటికీ.. ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. వృత్తిపరమైన విజయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్‌డేట్స్ కారణంగా సమంత సెర్చ్ ట్రెండ్స్‌లో మూడవ స్థానాన్ని దక్కించుకుంది. ఆమె ఆరోగ్యం, సోషల్ మీడియా పోస్టులపై అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. వరుణ్ ధావన్ సరసన నటించిన స్పై థ్రిల్లర్ 'సిటాడెల్: హనీ బన్నీ' ఆమెకు గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చింది. ఫిట్‌నెస్ వీడియోల ద్వారా ఆమె ఎప్పుడూ తన ఫ్యాన్స్‌కు చేరువగా ఉంటూ మూడో స్థానంలో నిలిచింది.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'గేమ్ ఛేంజర్' వంటి భారీ చిత్రంలో నటించడం కియారా అద్వానీకి బాగా కలిసి వచ్చింది. ఆమె పాన్ ఇండియా అప్పీల్ కారణంగా నాలుగో స్థానంలో నిలిచింది.  

కుర్రకారు కలల రాణి శ్రీలీల ఈ జాబితాలో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే కాకుండా, 'పుష్ప 2'లో  చేసిన 'కిస్సక్ ' ఐటమ్ సాంగ్ నంబర్ ఆమెకు భారీగా సెర్చ్ వాల్యూమ్ తెచ్చిపెట్టింది. ఈ పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ పాటలో ఆమె వేసిన స్టెప్పులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఆమె ఐదో స్థానంలో నిలిచింది. 

ఓవరాల్‌గా 2025 సంవత్సరం టాలీవుడ్ కథానాయికలకు డిజిటల్ పరంగా గొప్ప విజయాలను అందించింది. ముఖ్యంగా 'పుష్ప 2' మేనియా హీరోయిన్ల సెర్చ్ రేటింగ్‌లను అమాంతం పెంచేసింది. గ్లామర్ ,  టాలెంట్‌తో పాటు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు చేరువగా ఉండటం ఈ ముద్దుగుమ్మలకు ప్లస్ పాయింట్ అయ్యింది.