Gold & Silver Rates : 24 క్యారట్ల బంగారం.. గ్రాము రూ.14 వేలు

Gold & Silver Rates : 24 క్యారట్ల బంగారం.. గ్రాము రూ.14 వేలు

కొత్త ఏడాదిలో రాబోతున్న తొలి పండుగ సంక్రాంతి. అయితే ఈసారి సంక్రాంతికి బంగారం, వెండి కొనాలనుకునే వారికి మండిపోతున్న రేట్లు షాక్ ఇస్తున్నారు. తాజాగా గ్రాము మేలిమి బంగారం రిటైల్ మార్కెట్లో రూ.14వేలను దాటేయటంతో సామాన్య మధ్యతరగతి పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. కనీసం వెండి కొనాలన్నా ప్రస్తుతం ఉన్న రేట్లలో నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. అయితే పండుగ సమయం తర్వాత ఒకవేళ వెండి, బంగారం రేట్లు తగ్గుతాయేమో అని వేచిచూస్తున్నారు. ఎందుకంటే దీపావళి సమయంలో కూడా ఫెస్టివల్ తర్వాత రేట్లు పతనం అయ్యాయి కాబట్టి. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 26, 2025న బంగారం రేట్లు పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో డిసెంబర్ 25 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.77 పెరిగింది. తాజా పెంపు తర్వాత హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 002గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ గ్రాముకు రూ.12వేల 835గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ALSO READ : మూడేండ్లలో 33 కంపెనీలు!.. 

ఇక వెండి కూడా డిసెంబర్ నెలలో భారీ ర్యాలీని కొనసాగించింది. ముఖ్యంగా డిమాండ్ కి తగిన స్థాయిలో సరఫరా లేకపోవటంతో సిల్వర్ రేట్ల ర్యాలీ ఆగకుండా కొనసాగుతూనే ఉంది. దీంతో డిసెంబర్ 26, 2025న వెండి రేటు కేజీకి రూ.6వేలు పెరుగుదలను నమోదు చేసింది. ఈ ర్యాలీతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 54వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.254 వద్ద ఉంది.