వరి నుంచి ఇప్పటి వరకు.. అంటే మూడేళ్లలో సుమారు రూ.80 వేల కోట్ల విలువైన 33 కంపెనీలను తన ఖాతాలో వేసుకుంది. అమెరికాకు హిండెన్ బర్గ్ నివేదిక సృష్టించిన ప్రకంపనల తర్వాత పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతూ పెద్ద ఎత్తున కంపెనీలను దక్కించుకుంది. ఈ మొత్తం ఒప్పందాల విలువ 9.6 బిలియన్ డాలర్ల (దాదాపు 80 వేల కోట్ల)కు సమానం. పోర్టుల రంగానికి అత్యధికంగా రూ.28,145 కోట్లు ఖర్చు చేసింది. సిమెంట్ రంగానికి రూ.24,710 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.12,251 కోట్లు కేటాయించింది. కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలకు రూ.3,927 కోట్లు, ట్రాన్స్‌మిషన్ విభాగానికి రూ.2,544 కోట్లు కుమ్మరించింది. ఈ జాబితాలో దివాలా ప్రక్రియలో ఉన్న జేపీ గ్రూప్ కొనుగోలుకు సంబంధించిన రూ.13,500 కోట్లను చేర్చలేదు. ఆస్ట్రేలియాలోని నార్త్ క్వీన్స్ లాండ్ ఎగుమతి టెర్మినల్‌ను రూ.21,700 కోట్లతో కొనుగోలు చేయడం ఈ మూడేళ్లలో అతిపెద్ద ఒప్పందంగా నిలిచింది. ఆఫ్రికా దేశం టాంజానియాలోని దార్ ఎస్ సలామ్ పోర్టును రూ.330 కోట్లతో కొనుగోలు చేసి విదేశాల్లోనూ తన పట్టు పెంచుకుంది.
భారీగా సిమెంట్ కంపెనీల కొనుగోళ్లు
సిమెంట్ రంగంలోనూ అదానీ గ్రూపు దూకుడు చూపింది. అంబుజా, ఏసీసీ ద్వారా వరుస కొనుగోళ్లు జరిపింది. సంఘీ ఇండస్ట్రీస్ కోసం రూ.ఐదు వేల కోట్లు, పెన్నా సిమెంట్ కోసం రూ.10,422 కోట్లు, ఓరియంట్ సిమెంట్ కోసం రూ.8,100 కోట్లు చెల్లించింది. ఐటీడీ సిమెంటేషన్ కంపెనీని రూ.5,757 కోట్లతో తన వశం చేసుకుంది. ఓడరేవుల రంగంలో కరైకల్ పోర్టును రూ.1,485 కోట్లు, గోపాల్ పూర్ పోర్టును రూ.3,080 కోట్లు, ఆస్ట్రో ఆఫ్ షోర్ సంస్థను రూ.1,550 కోట్లతో దక్కించుకుంది. విద్యుత్ రంగంలో లాంకో అమరకంటక్ రూ.4,101 కోట్లు, విదర్భ ఇండస్ట్రీస్‌ను రూ.4 వేల కోట్లు, కోస్టల్ ఎనర్జెన్ రూ.3,335 కోట్లతో కొనుగోలు చేసింది. డేటా సెంటర్లు, రహదారులు, రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ అదానీ గ్రూప్ ఒప్పందాలు కుదుర్చుకుంది. అప్పులను తగ్గించుకుంటూ వ్యాపారాలను విస్తరించడం ద్వారా రుణదాతల నమ్మకాన్ని పొందింది. నెట్ డెట్ టు ఎబిటా నిష్పత్తిని మూడు శాతానికి తగ్గించింది. రాబోయే ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాలు, ఇంధనం, లాజిస్టిక్స్ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టనుంది.
