విశాఖ తీరాన్ని సునామీ కుదిపేసిన దృశ్యాలు ఇంకా కళ్లలో నుంచి చెదిరిపోలేదు. ప్రశాంతంగా బీచ్ లో ఆడుకుంటున్న చిన్నారులను, పొట్టకూటి కోసం పల్లికాయలు అమ్ముకుంటున్న కూలీలను, ఎన్నో కుటుంబాలను, ఎంతో మంది ప్రాణాలను బలితీసుకున్న సునామీ వచ్చి ఇవాళ్టికి (2025, డిసెంబర్ 26) 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.. అలాంటి పరిస్థితులు రాకుండా చూడు తల్లీ అంటూ విశాఖ తీరంలో భారీ ఎత్తున మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
విశాఖ తీరాన్ని సునామీ కుదిపేసి ఇవాళ్టికి సరిగ్గా 21 ఏళ్లు పూర్తయ్యాయి. 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ రోజు నుంచి ప్రతీ ఏటా విశాఖ సముద్ర తీరాన మత్స్యకార మహిళలు గంగమ్మ తల్లికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇవాళ కూడా మహిళలు భారీ ఎత్తున సాగర తీరానికి చేరుకుని.. గంగమ్మకు హారతులు ఇచ్చారు. మళ్లీ సునామీ లాంటి విపత్తు రాకుండా కాపాడు తల్లీ అంటే వేడుకున్నారు.
►ALSO READ | దేవుడా.. : తిరుమల కొండపై సైకోగాడు.. కత్తితో పిల్లల వెంట పరుగులు
సముద్రంలో వేటకు వెళ్ళే తమ కుటుంబీకులు సురక్షితంగా తిరిగి ఇంటికి రావాలని గంగమ్మ తల్లికి కుంకుమ పూజలు చేశారు మహిళలు. పెదజాలరి పేట తీరంలో వేలాదిగా మహిళలు తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
