తిరుమల కొండ కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా భక్తులే.. లక్షల మంది భక్తులతో తిరుమల కొండ రద్దీగా ఉన్న సమయంలోనరే.. ఓ సైకో గాడు ఉరుకులు పరుగులు పెట్టించాడు. 2025, డిసెంబర్ 26వ తేదీ మధ్యాహ్నం.. తిరుమల కొండపై.. బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు.
చేతిలో కత్తి పెట్టుకుని.. భక్తుల వెంట పరిగెత్తాడు. కత్తితో పొడుస్తా.. చంపుతా అంటూ కేకలు వేస్తూ.. భక్తుల వెంట పడ్డాడు. ఈ సైకోగాడి చేష్టలతో భక్తులు పరుకులు పరుగులు పెట్టారు.
ALSO READ : మేడ్చల్ అన్నోజీగూడలో ప్రమాదం..
భక్తుల పరుగులతో వెంటనే అలర్ట్ అయ్యారు తిరుమల ట్రాఫిక్ పోలీసులు. సైకో గాడిని పట్టుకున్నారు. వాడి దగ్గర ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్ రాష్ట్రం నుంచి వచ్చానని చెబుతున్నాడు. పేరు అడిగితే ఏదేదో చెబుతున్నాడు. బిత్తర చూపులు, చేష్టలతో అతనికి మతిస్థిమితం లేదని తెలుస్తుందని.. మిగతా వివరాలు సేకరించి వాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తామంటున్నారు పోలీసులు.
మళ్లీ బయటకు వెళితే ఏం చేస్తాడో ఏమో అనే భయంతో.. తిరుమల కొండపై ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి.. అక్కడే ఉంచారు పోలీసులు.
