ధన్వాడ, వెలుగు: సీఎం కప్ క్రీడాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాకు, గురుకుల పాఠశాలకు మంచి గుర్తింపు తేవాలని డీవై ఎస్ ఎస్ఓ వెంకటేశ్ శెట్టి సూచించారు. గురువారం కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాల మైదానంలో బాస్కెట్ బాల్, నెట్ బాల్, పూట్ బాలు, సాఫ్ట్ బాల్, అధ్యాపాటియా, చెస్ జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
గెలుపొందిన వారు.ఈనెల 20 నుంచి 23 వరకు వివిధ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరపున పాల్గొననున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కోటకొండ భీమన్న , ప్రిన్సిపాల్ రాజారాం, ఎస్ జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఎం ఈ వో గాయత్రి, నెట్ బాల్ జిల్లా సంఘం అధ్యక్షుడు శెట్టి రమేశ్, భాను కిరణ్, రవికుమార్, రామ్మోహన్ గౌడ్ పాల్గొన్నారు.
